ఈసారైనా పెరిగేనా..
–8లో u
పదేళ్ల నుంచి చిరుధాన్యాల సాగు ఇలా (ఎకరాల్లో)..
ఏడాది జొన్న, సజ్జ ఇతర
చిరుధాన్యాలు
2016–17 6,881 500
2017–18 4,138 650
2018–19 3,767 1,050
2019–20 2,572 271
2020–21 3,412 380
2021–22 4,210 325
2022–23 5,467 539
2023–24 3,220 269
2024–25 6,221 276
2025–26 7,595 45
గద్వాలవ్యవసాయం: దైనందిన జీవితంలో అనేక ఒతిళ్లు, ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులతో పలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అలాంటి వారికి బలవర్దకమైన ఆహారం చిరుధాన్యాలే. మార్కెట్‌లో చిరుధాన్యాలకు మంచి డిమాండ్ ఉంది. వీటి సాగును ప్రభుత్వం ప్రోత్సహించకపోవడంతో రైతులు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. అయితే ఈసారి ఎల్‌నినో ప్రభావంతో రైతులు ఆరుతడి పంటలను సాగుచేసేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతడి పంటలైన చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టిసారించాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.
ప్రోత్సాహం కరువు..
ప్రభుత్వం పత్తి, వరి, మొక్కజొన్న తదితర పంటల కు మద్దతు ధరలను ఇస్తోంది. ఆయిల్‌పామ్, పలు పండ్ల తోటలకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. కానీ చిరుధాన్యాలకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. చిరుధాన్యాలన్నీ ఆరుతడి పంటలే. సాధారణంగా రెండు సీజన్లలో సాగు చేయొచ్చు. వీటి నూతన యాజమాన్య పద్ధతులపై రైతులకు సరైన అవగాహన కొరవడింది. స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం లేదు. వీటన్నింటి ఫలితంగా జిల్లాలో పత్తి, మిర్చి, పొగాకు లాంటి వాణిజ్య పంటలతో పాటు వరి, మొక్కజొన్న పంటలపై రైతులు ఎక్కువగా దృష్టిసారిస్తూ వస్తున్నారు. 10 – 15 ఏళ్ల క్రితం వరకు జొన్న, సజ్జ వంటి చిరుధాన్యాలను సాగుచేసిన రైతులు.. ఆ తర్వాత వరి, పత్తి పంటలు వేస్తున్నారు.
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగుచేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. వ్యవసాయశాఖ సైతం జిల్లావ్యాప్తంగా క్షేత్రస్థాయిలో అవగాహన సమావేశాలు నిర్వహించింది. అయితే ఈఏడాది వానాకాలంలో చిరుధాన్యాల సాగు ఏ మేరకు అవుతుందో చూడాలి. వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ రైతులు అటుగా ఆలోచించడం లేదు. అయితే వ్యవసాయశాఖ అవగాహన కార్యక్రమాలతో సరిపెట్టుకోకుండా.. క్షేత్రస్థాయిలో రైతులను సమాయత్తం చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. దీంతో పాటు రాయితీ రూపంలో విత్తనాలు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తే వీటి సాగు మరికొంత పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో చిరుధాన్యాల సాగుతో రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది.
జిల్లాలో ఆరుతడి పంటల సాగుపై వ్యవసాయశాఖ దృష్టి
చిరుధాన్యాల సాగులో రైతులను
ప్రోత్సహిస్తే ప్రయోజనం
ఇప్పటికే క్షేత్రస్థాయిలో అవగాహన


