సొంతూరులోనే ఓటేస్తాం! | - | Sakshi
Sakshi News home page

సొంతూరులోనే ఓటేస్తాం!

Jul 27 2026 12:54 AM | Updated on Jul 27 2026 12:54 AM

పల్లెల్లోనే ఓటరు నమోదుకు మొగ్గు

స్వయంగా ఎన్యూమరేషన్‌ ఫారాలు అప్పగిస్తున్న జనం

సర్‌ ప్రక్రియలో ఒకటి కంటే ఎక్కువ ఉన్న ఓట్లకు చెక్‌

ఓటరు జాబితా నుంచి తొలగింపు దిశగా చర్యలు

తలలు పట్టుకుంటున్న బీఎల్‌ఓలు..

క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలకు ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్‌ ఫారాలు పూర్తి స్థాయిలో అందక డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేయలేకపోతున్నారు. ఓవైపు నిర్ణీత గడువులోగా డిజిటలైషన్‌ ప్రక్రియ 100 శాతం పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటం.. మరోవైపు టెక్నికల్‌ అధికారులుగా నియమించిన వారి నుంచి పూర్తి సహకారం అందకపోవడంతో బీఎల్‌ఓలు తలలు పట్టుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో డిజిటలైజేషన్‌ చేసుకున్న వారు సైతం ఎన్యూమరేషన్‌ ఫారాలు అందజేయాల్సి ఉండగా.. చాలా మంది ఇవ్వడం లేదని బీఎల్‌ఓలు పేర్కొంటున్నారు. ఎన్యూమరేషన్‌ ఫారం డిజిటలైషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తుండగా.. సాంకేతిక సమస్యతో ‘నో మ్యాపింగ్‌’ అని వస్తుండటంతో మరోసారి సరిచేయాల్సి రావడం తలనొప్పిగా మారింది. ఇంకా ఓటర్ల నుంచి 10 నుంచి 15శాతం ఎన్యూమరేషన్‌ ఫారాలు అందాల్సి ఉందని చెబుతున్నారు.

పట్టణాల్లో మందకొడిగా..

సర్‌ డిజిటలైజేషన్‌ ప్రక్రియ గ్రామాల్లో జోరుగా.. పట్టణాల్లో మందకొడిగా సాగుతోంది. కొందరు ఓటర్లు ఎన్యూమరేషన్‌ పత్రాలు తిరిగి ఇవ్వడంలో జాప్యం చేస్తుండటంతో అధికారులు పాట్లు పడుతున్నారు. ఓటర్లకు స్వయం ఫోన్‌చేసి అడుగుతున్నా అప్పుడు, ఇప్పుడు అని అంటున్నారని బీఎల్‌ఓలు వాపోతున్నారు.

అచ్చంపేట: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్‌) ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో వేగంగా సాగుతోంది. గ్రామాల్లో బీఎల్‌ఓలు ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ, ఓటర్ల వివరాలను ధ్రువీకరిస్తుండగా.. సూపర్‌వైజర్లు, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ అధికారులు, సిబ్బంది సమన్వయంతో డిజిటలైజేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. అయితే ఉన్నత విద్య, ఉద్యోగాలు, జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిలో ఎక్కువ మంది పుట్టిన ఊరిలో ఓటు ఉంచుకునేందుకు మక్కువ చూపుతున్నారు. స్వయంగా స్వగ్రామానికి వచ్చి ఎన్యూమరేషన్‌ ఫారాలు నింపి బీఎల్‌ఓలకు అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement