కందనూలు: జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆ దివారం నెలపొడుపు సాహిత్య సాంస్కృతిక సాహి త్య వేదిక ఆధ్వర్యంలో రచయిత వనపట్ల సుబ్బ య్య రచించిన పసరంటిన కొడవలి పుస్తకాన్ని మా జీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమ్మల జీవిత చరిత్ర, తల్లుల శ్రామిక బహుజన తత్వాన్ని అక్షరాల రూపంలో తీర్చిదిద్దడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో ప్రొ.కోటేశ్వర్‌రావు, వహిద్‌ఖాన్, వనపట్ల సర్పంచ్ వాసుదేవుడు పాల్గొన్నారు.


