డివిజన్‌–4 పరిధిలో 11 స్కీంలు.. | - | Sakshi
Sakshi News home page

డివిజన్‌–4 పరిధిలో 11 స్కీంలు..

May 27 2026 6:02 AM | Updated on May 27 2026 6:02 AM

ఆర్డీఎస్‌ డివిజన్‌–4లో మొత్తం 11 ఎత్తిపోతల పథకాలు కలిశాయి. అందులో ఊట్కూర్‌ 1, 2, బుడమరుసు, మద్దూర్‌, రాజోళి, తూర్పు గార్లపాడు, క్యాతూర్‌ 1, 2, అలంపూర్‌, గొందిమళ్ల పథకాలు ఉన్నాయి. కాగా, ఇందులో కొన్నింటిని ప్రభుత్వమే ఏర్పాటు చేయగా.. మరికొన్ని రైతులు ఏర్పాటు చేసుకున్నారు. వాటి నిర్వహణ ప్రస్తుతం ప్రభుత్వ పరిధిలోకి రావడంతో రైతులకు కొంత ఉపశమనం కలిగింది. ప్రస్తుతం ఏదేని ఎత్తిపోతల పథకం పైప్‌లైన్‌ పగిలిపోయినా, పూడిక తొలగించడం, స్టార్టర్లను బాగుచేయడం, మోటార్ల రిపేర్లు, మేజర్‌ మరమ్మతులకు సంబంధించిన ప్రతిపాదనలను ఆర్డీఎస్‌ అధికారులే సిద్ధం చేయడంతో పాటు మరమ్మతులు చేయిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement