రాళ్లతో కూడినది కావడంతో..
–8లో u
జలాశయంలో కష్టసాధ్యంగా పూడికతీత వ్యవహారం
జూరాల ప్రాజెక్టులో సుమారు 2 టీఎంసీలకు పైనే బురద పేరుకుపోయినట్లు సర్వేలో తేలింది. ఈ క్రమంలో ఇసుకను తీసుకుని బురద తొలగించేందుకు పనులు దక్కించుకునే ఏజెన్సీలు ప్రభుత్వానికి రూ.300 కోట్లు చెల్లించాలని తుది నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి మూడు నెలల కిందట పంపించాం. దీనిపై ప్రభుత్వం నుంచి నిర్ణయం రావాల్సి ఉంది.
– జుబేర్, జూరాల డ్యాం ఈఈ
గద్వాల: కృష్ణాబేసిన్ పరిధిలో ఉమ్మడి తెలుగు రా ష్ట్రాల్లోనే తొలిప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల. ఉమ్మ డి పాలమూరులోని నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, పాలమూరు– రంగారెడ్డి, కోయిల్‌సాగర్‌తోపాటు నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచే నీరు విడుదల అవుతుంది. ఇంతటి ప్రాధాన్యత గల జూరాల జలాశయం ప్రస్తుతం బురదతో పూడుకుపోయింది. ఫలితంగా జలాశయంలో నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోయి.. రబీ సీజన్‌లో సాగు, తాగు నీటి కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో జూరాల జలాశయంలో పూడిక తీసేందుకు అధికారులు సన్నాహాలు చేపట్టారు. ఇందులో భాగంగా జలాశయంలో ఎంతమేర బురద పేరుకుపోయింది. ఎన్నిటీఎంసీల నీటినిల్వ సామర్థ్యం తగ్గిందనే లెక్క లు వేశారు. జలాశయంలో పేరుకుపోయిన బురదను తొలగించేందుకు సుమారు రూ.312 కోట్లు వ్యయం అవుతుందని అంచనాలు రూపొందించి నివేదికను మూడు నెలల కిందట ప్రభుత్వానికి సమర్పించారు.
1,045 అడుగులు..
జూరాల ప్రాజెక్టు జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు (1,045 అడుగులు) కాగా.. ఇందులో ప్రస్తుతం 2 టీఎంసీలపైనే బురద పేరుకుపోయింది. దీనిపై ప్రభుత్వం పలుమార్లు సర్వే చేయించగా.. సుమారు 2.16 టీఎంసీల బురద పేరుకుపోయినట్లు అధికారులు లెక్క తేల్చారు. అంటే జలాశయం సామర్థ్యం 7.5 టీఎంసీలకు కుదించుకుపోయినట్లయింది.
2012 నాటికే..
ఇందులో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కృష్ణాబేసిన్‌లో నిర్మించిన జూరాల ప్రాజెక్టులో 2012 సంవత్సరం నాటికే 2.16 టీఎంసీల బురద పేరుకు పోయినట్లు,ఆ తర్వాత బురద పేరుకునేందుకు సరి పడా స్థలం కూడా లేకపోవడంతో వరదల సమయంలో నీటితోపాటు బురద సైతం దిగువకు వెళ్తు న్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టుకు ఉన్న క్రస్టుగేట్లలో పెద్దఎత్తున బురద పేరుకుపోయి గేట్లు, ఇనుప రోపులకు నష్టం వాటిల్లుతున్నట్లు గుర్తించారు.
2.30 టీఎంసీల మేర
పేరుకుపోయిన బురద
పలుమార్లు సర్వేలు..
రూ.312.77 కోట్ల అంచనా వ్యయం
నివేదిక అందజేసిన
సాగునీటి పారుదలశాఖ
అంతర్గత చర్చలో అసాధ్యమనే అధికారుల అభిప్రాయం
సాధారణంగా జలాశయంలో బురద తొలగించిన అనంతరం బయటకు వచ్చే ఇసుక సుమారు 20– 30 శాతం మేర ఉంటుందని అధికారుల అంచనా. అయితే కృష్ణాబేసిన్ సహజ స్వరూపం రాళ్లతో కూడినది కావడంతో ఇసుక మేట్లు అనుకున్నంత స్థాయిలో ఏర్పడవు. అదే తుంగభద్ర నది సహజ స్వరూపం అధిక భాగం ఇసుకతో కూడుకున్నదై ఉంటుంది. దీంతో తుంగభద్ర బేసిన్‌లో ఏర్పడే ఇసుకమేట్లు కృష్ణాబేసిన్‌లో ఏర్పడవని అధికారులు తేల్చారు. ఏప్రిల్ చివరి వారంలో హైదరాబాద్‌లో ఈఎన్‌సీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలోనూ ఇదే అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. 7 శాతం ఇసుక వస్తే బురద తొలగించేందుకు ఏజెన్సీలు ముందుకు రావని, దీంతో జూరాలలో బురద తొలగింపు అసాధ్యమైన పని అని సమావేశంలో అభిప్రాయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.


