స్టేషన్ మహబూబ్‌నగర్: ముస్లింలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు మౌలానా అబుతాలిబ్ కోరారు. ఆల్ పార్టీ ముస్లిం రైట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం రాత్రి ‘హమారీ ఆవాజ్’ పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించారు. ముఖ్య వక్తగా పాల్గొన్న మౌలానా అబుతాలిబ్ మాట్లాడుతూ దేశంలో మత విద్వేషాలను వీడి అభివృద్ధి వైపు దృష్టిసారించాలని సూచించారు. అదేవిధంగా ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, నెల్లంటి సత్యం, మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నర్సయ్య, జూలకంటి రాంరెడ్డి మాట్లాడుతూ ముస్లింల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ముస్లిం లీగ్ రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ షకీల్ అహ్మద్‌తోపాటు పలువురు ముస్లిం సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ముస్లిం డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలని విన్నవించారు. జనాభా నిష్పత్తి ప్రకారం అన్నివర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, సచార్, రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సులను పూర్తిగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారం కోసం అందరం ఏకమవుదామని పిలుపునిచ్చారు. అలాగే సభలో టీఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కాచం సత్యనారాయణ, ప్రొఫెసర్ ఇస్లాముద్దీన్ ముజాహిద్, ప్రముఖ సామాజికవేత్త జిలకరి శ్రీనివాసులు తదితరులు ప్రసంగిస్తూ ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వాలు కృషి చేయాలని అవసరం ఉందన్నారు. సభలో పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, హజ్రత్ మర్దాన్‌అలీషా దర్గా పీఠా ధిపతి అబ్దుల్‌రజాక్‌షా ఖాద్రీ, జేఏసీ కమిటీ ప్రతినిధులు ఖాజా ఫయాజుద్దీన్ అన్వర్‌పాష, హనీఫ్ అ హ్మద్, ఎస్‌ఎం ఖలీల్, జాకీర్ అడ్వకేట్, మోసీన్‌ఖాన్, మౌలానా నాసిర్ మజహరి, ఇస్మాయిల్, మహ్మ ద్ అహ్మద్ అలీ సనా, హాఫిజ్ ఇద్రీస్, షేక్ సిరాజుద్దీన్, మౌలానా ఖవి, సాధిక్ హుస్సేన్, తయ్యబ్ బాష్వార్, అబ్దుల్లా సున్నీ పాల్గొన్నారు.


