కందనూలు: నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులపై మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కీలక సమీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ హేమంతకేశవ్ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పాడి పరిశ్రమ, క్రీడలు, యువజనశాఖల మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ డా.మల్లు రవి, ఎమ్మెల్సీలతో పాటు నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నీటిపారుదల ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి, పనుల పురోగతి, భూసేకరణ సమస్యలు, పెండింగ్ పనులు, పునరావాసం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
నేటి నుంచి డీఎడ్ పరీక్షలు
వనపర్తిటౌన్: జిల్లాలో డీఎడ్ ప్రథమ సంవత్సర పరీక్షలు సోమవారం నుంచి జూన్ 1వ తేదీ వరకు కొనసాగనున్నట్లు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ, ఏసీజీఈ గణేష్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఉదయం 8:30 గంటల వరకు కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ జాతర కు ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా జా తర మైదానంలో ప్రత్యేకంగా తయారుచేసిన పచ్చిపులుసు అన్నంతో మైసమ్మకు నైవేద్యం సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యే క పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల సౌకర్యార్థం నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడిపించారు. భక్తులతో జాతర మైదానం కిక్కిరిసింది. భక్తులకు సరిపడా షెడ్లు లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. సుమారు 10వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
మంచినీటి కోసం అవస్థలు..
నాయినోనిపల్లి మైసమ్మ జాతరలో మంచినీటి కోసం భక్తులు అవస్థలు పడ్డారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నీటి వసతి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొందరు మినీ వాటర్‌ట్యాంకుపైకి ఎక్కి మరీ నీటిని తెచ్చుకున్నారు. జాతర మైదానంలో ఓవర్‌హెడ్ వాటర్‌ట్యాంకు నిరుపయోగంగా మారినా ఎవరూ పట్టించుకోవడం లేదని.. భక్తులకు నీటి సమ స్య లేకుండా చూడాలని పలువురు కోరారు.


