ఎర్రవల్లి: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మండలంలోని తిమ్మాపురంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటివరకు రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలతో పాటు నిర్దేశిత మిల్లులకు ధాన్యం రవాణా ప్రక్రియను తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రానికి కేటాయించిన టార్ఫాలిన్లు, గన్నీబ్యాగులపై ఆరా తీశారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించి.. రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రస్తుతం అకాల వర్షాలు కురుస్తుంన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని త్వరగా తరలించి.. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆయన వెంట టాస్క్‌ఫోర్స్ సీఐ పండరి, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, సివిల్ సప్లయ్ డీటీ ప్రశాంత్‌గౌడ్, ఏఈఓ నరేశ్ ఉన్నారు.


