వేరుశనగ క్వింటా రూ.7,951 | - | Sakshi
Sakshi News home page

వేరుశనగ క్వింటా రూ.7,951

May 24 2026 12:51 AM | Updated on May 24 2026 12:51 AM

గద్వాలవ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు శనివారం 52 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,951, కనిష్టంగా రూ. 6,899, సరాసరి రూ. 7,099 ధరలు లభించాయి. అదే విధంగా 11 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,149, కనిష్టంగా రూ. 5,709, సరాసరి రూ. 6,089 ధరలు పలికాయి. 141 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,482, కనిష్టంగా రూ. 1,860, సరాసరి రూ. 2,482 ధరలు లభించాయి. 5 క్వింటాళ్ల కందులు రాగా.. రూ. 6,089 ధర పలికింది.

హిందూ బంధువుల ఐక్యతే లక్ష్యం

దేవరకద్ర: హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి ఐక్యపరిచి మనదేశాన్ని విశ్వగురువుగా నిర్మాణం చేయాలనే లక్ష్యం చేరుకోవాలని తెలంగాణ హిందూ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌స్వామిజీ పిలుపునిచ్చారు. శనివారం రాత్రి దేవరకద్రలో శ్రీనివాసగార్డెన్‌లో హిందూ సమ్మేళన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్వామిజీ మాట్లాడుతూ.. యువత భారతీయ సంస్కృతిని కాపాడటంలో కీలక పాత్ర పోషించాలని కోరారు. హిందూ సమాజంలో ఐక్యత సేవాభావం పెంపొందిచడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు.

ధర్మరక్షణకు ముందుకు రావాలి

సమాజంలో సనాతన ధర్మ విలువలను పరిరక్షించాల్సి అవసరం ఉందని, మహిళలు, యువత సామాజిక చైతన్యంతో ముందుకొచ్చి భారతీయ సంస్కృతిని భావితరాలకు అందిచాలని హైకోర్టు న్యాయవాది మౌనిక సుంకర కోరారు. ఆమె ముక్యవక్తగా ప్రసంగించారు. సంస్కార భారతి ప్రాంత సంఘటన మంత్రి నిరంజన్‌, బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొండ ప్రశాంత్‌రెడ్డి, ఉత్సవ సమితి అధ్యక్షుడు ఆంజనేయులు, కల్వ నరేష్‌, భాస్కర్‌ పాల్గొన్నారు.

శాసీ్త్రయ విద్యావిధానం అమలు చేయాలి

కొల్లాపూర్‌: శాసీ్త్రయ విద్యా విధానం అమలు కోసం విద్యార్థులు ఉద్యమాలకు సిద్ధం కావా లని యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి శ్రీధర్‌శర్మ అన్నారు. కొల్లాపూర్‌లోని పీజీ సెంటర్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులను శ్రీధర్‌శర్మ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు జితేందర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ జాతీయ విద్యా విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగానికి కనీస నిధులు కేటాయించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సంపన్న వర్గాలకే ఉన్నత చదువులు లభించే మార్గాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి తారాసింగ్‌, రామార్జున్‌ తదితరులు ఉన్నారు.

జాతీయస్థాయికి ఎదగాలి

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లా క్రికెటర్లు జాతీయస్థాయికి ఎదగాలని ఎండీసీఏ చీఫ్‌ ప్యాట్రన్‌, ప్రముఖ న్యాయవాది మనోహర్‌రెడ్డి అన్నారు. జిల్లా సీనియర్‌ క్రీడాకారులకు శనివారం పిల్లలమర్రి సమీపంలోని ఎండీసీఏ మైదానంలో క్రీడాదుస్తులు పంపిణీ చేశారు. ఎలాంటి ఒత్తిడి లెకుండా సమష్టిగా ఆడితే క్రికెట్‌లో విజయం సాధింవచ్చన్నారు. ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ మాట్లాడుతూ.. హెచ్‌సీఏ బి–డివిజన్‌ టీ–20 లీగ్‌ కమ్‌ నాకౌట్‌ టోర్నమెంట్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి ఇప్పటికే రెండు మ్యాచుల్లో విజయం సాధించినట్లు తెలిపారు. రానున్న మ్యాచుల్లో విజయాలు సాధించాలని కోరారు. ఎండీసీఏ ఉపాధ్యక్షులు సురేష్‌కుమార్‌, సంయుక్త కార్యదర్శి వెంకటరామారావు, కోచ్‌లు గోపాలకృష్ణ, అబ్దుల్లా, మన్నాన్‌, ముఖ్తార్‌అలీ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement