గద్వాలన్యూటౌన్: ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు జిల్లా ఇన్‌చార్జీలు మెట్టు శ్రీనివాస్, ఆంజనేయులుగౌడ్ పిలుపునిచ్చారు. శనివారం బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాసు హనుమంతునాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ అస్థిత్వానికి రక్షణ కవచంగా నిలిచేందుకు కార్యకర్తల సమూహంగా సభ్యత్వ నమోదు జరగాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు అధ్వాన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలనే నినాదంతో ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. సభ్యత్వ నమోదుతో పార్టీ సంస్థాగత నిర్మాణం పటిష్టం చేయాలన్నారు. పార్టీపై విధేయతతో ఉండే నాయకులు, కార్యకర్తలను గుర్తించి.. వారికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సభ్యత్వ నమోదు డిజిటల్ పద్ధతిన సాగుతుందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 25 నుంచి వచ్చే నెల 25 వరకు ‘సర్’ కార్యక్రమం నిర్వహిస్తుందని, బూత్ కమీటీ సభ్యులు అప్రమత్తంగా ఉండి, బీఆర్‌ఎస్ సానుభూతిపరుల ఓట్లను కాపాడుకోవాలన్నారు. గద్వాల ఇన్‌చార్జి బాసు హనుమంతునాయుడు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలన్నారు. సభ్యత్వ నమోదులో గద్వాల ముందు ఉండాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. ఉద్యమ నేత కేసీఆర్ స్ఫూర్తితో మళ్లీ బీఆర్‌ఎస్ పాలనను తెచ్చుకుందామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ కేశవ్, నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, పద్మ వెంకటేశ్వర్‌రెడ్డి, బాసు శ్యామల, రాఘవేంద్రరెడ్డి, చక్రధర్‌రావు, కోటేష్, అతికూర్ రహమాన్, మోనేష్, కురవ పల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


