గద్వాల న్యూటౌన్: రాష్ట్రంలోని వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో వృద్ధుల కోసం ఏర్పాటుచేసిన మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. వృద్ధుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం.. స్వావలంబన పెంపొందించడం లక్ష్యంగా ప్రభుత్వ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ జయలక్ష్మి, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ అయ్యపురెడ్డి పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు.. పేదలకు వరం
ధరూరు/కేటీదొడ్డి: ఇందిరమ్మ ఇళ్లు పేదలకు ఓ వరమని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ధరూరులో ఫరీదాబేగం, కేటీదొడ్డిలో శంకరమ్మ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల నెరవేరుతోందన్నారు. గద్వాల నియోజకవర్గంలో మొదటి విడతగా 3,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయగా.. ఇప్పటికే 1,500 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్నాయన్నారు. త్వరలోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం ధరూరు శివారులో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలతో ఎమ్మెల్యే మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయని.. కూలీలు వడదెబ్బకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, సర్పంచ్ డీఆర్ విజయ్‌కుమార్, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, రమేశ్ నాయుడు, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, ఉరుకుందు, టీచర్ ఆంజనేయులు, కొండన్న, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, ఉపసర్పంచ్ ఈదన్న పాల్గొన్నారు.


