ఈ నెల 30 వరకు రేషన్‌ పంపిణీ | - | Sakshi
Sakshi News home page

ఈ నెల 30 వరకు రేషన్‌ పంపిణీ

Apr 14 2026 7:28 AM | Updated on Apr 14 2026 7:28 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): జిల్లాలో ఈ నెల 30 వరకు రేషన్‌ బియ్యం పంపిణీ కొనసాగుతుందని జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 506 రేషన్‌ దుకాణాల ద్వారా మూడు నెలల ఉచిత సన్నబియ్యం పంపిణీ ప్రక్రి య కొనసాగుతుందన్నారు. జిల్లావ్యాప్తంగా 2,78,386 కార్డులకు గాను సోమవారం వరకు 1,71,328 కార్డుదారులు (61 శా తం) బియ్యం తీసుకొన్నారని చె ప్పారు. బియ్యం పంపిణీని ఈ నెల 30 వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తామని, కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement