ఫలితాలు మెరుగు | - | Sakshi
Sakshi News home page

ఫలితాలు మెరుగు

Apr 13 2026 7:26 AM | Updated on Apr 13 2026 7:26 AM

4, 13వ స్థానాలు..

జోగుళాంబ గద్వాల
గతంతో పోల్చితే ఇంటర్మీయడిట్‌లో పెరిగిన ఉత్తీర్ణత శాతం

ప్రథమ సంవత్సరంలో 18..

ద్వితీయ సంవత్సరంలో 14వ స్థానం

అత్యధిక శాతం ఉత్తీర్ణతతో

సత్తాచాటిన బాలికలు

సోమవారం శ్రీ 13 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

జిల్లాలో ఇంటర్‌ విద్యార్థుల

ఉత్తీర్ణత శాతం ఇలా....

ఏడాది ఫస్టియర్‌ రాష్ట్రస్థాయిలో

స్థానం

2023– 24 53.24 21

2024– 25 62.58 23

2025– 26 73.01 18

ఏడాది సెకండియర్‌ రాష్ట్రస్థాయిలో

స్థానం

2023– 24 62.82 23

2024– 25 57.16 21

2025– 26 62.06 14

గద్వాల న్యూటౌన్‌: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా జోగుళాంబ గద్వాల జిల్లా స్థానం కాస్త మెరుగుపడింది. ఆదివారం ఇంటర్‌ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు రాణించారు. గతంతో పోల్చితే ఈసారి ఉత్తీర్ణత శాతం కాస్త పెరిగింది. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 62.06 శాతంతో 18వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 73.01 శాతంతో 14వ స్థానంలో జిల్లా నిలిచింది. అలాగే గతంలో మాదిరిగానే ఈసారి కూడా బాలికలే మెరుగైన ఫలితాలు సాధించారు. మొదటి సంవత్సరంలో 1,539 మంది బాలురు పరీక్షలు రాయగా.. 730 మంది (47.43 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అలాగే 1,943 మంది బాలికలు పరీక్షలు రాయగా.. 1,431 మంది (73.65 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 1,283 మంది బాలురు పరీక్ష రాయగా.. 785 మంది (61.18 శాతం), 1,711 మంది బాలికలు హాజరు కాగా 1,401 మంది (81.88 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

గురుకులాల ప్రతిభ

ఇంటర్‌ ఫలితాల్లో ప్రధానంగా గురుకుల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. బీచుపల్లి గురుకులంలో ద్వితీయ సంవత్సర విద్యార్థులు జశ్వంత్‌, వంశీలు ఎంపీసీ విభాగంలో 992/1000 మార్కులు సాధించారు. అలాగే ఇక్కడే చదువుతున్న నరేష్‌గౌడ్‌ బైపీసీ విభాగంలో 992/1000 సాధించాడు. ఇదే కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులు కార్తీక్‌ ఎంపీసీ విభాగంలో 466/470 సాధించగా.. బైపీసీ విభాగంలో రఫీ 436/440 సాధించాడు. అలాగే బిజ్వారం బీసీ సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులు రాఘవి, సింధు బైపీసీ విభాగంలో 438/440 మార్కులు సాధించారు.

ఇంటర్‌ ఒకేషనల్‌లో కూడా ఈసారి గతం కంటే మంచి ఫలితాలు వచ్చాయి. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 706 మంది విద్యార్థులు పరీక్ష లు రాయగా ఇందులో 532 మంది (75.4 శాతం) ఉత్తీర్ణత సాధించగా.. రాష్ట్రస్థాయిలో 13వ స్థానం లభించింది. ఇక ప్రథమ సంవత్సరంలో 884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. ఇందులో 612 మంది విద్యార్థులు (69.23 శాతం) ఉత్తీర్ణులవగా.. రాష్ట్రస్థాయిలో 4వ స్థానం జిల్లాకు దక్కింది.

Advertisement
 
Advertisement
Advertisement