సీఎం దృష్టికి తీసుకెళ్తా.. | - | Sakshi
Sakshi News home page

సీఎం దృష్టికి తీసుకెళ్తా..

Apr 11 2026 8:28 AM | Updated on Apr 11 2026 8:28 AM

జూరాలలో నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో వేసవిలో తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ విషయాన్ని వెంటనే సాగునీటి పారుదల శాఖ మంత్రి, సీఎం దృష్టికి తీసుకెళ్లా. కర్ణాటక నుంచి మనకు 2 టీఎంసీలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతాను. – బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, గద్వాల

నీటి చౌర్యంతోనే..

జూరాల ఎడమ కాల్వ కింద 4 ఎకరాల్లో వరి సాగుచేశా. వారంలో నాలుగు రోజులు సాగునీరు వదులుతున్నామంటూ మిగిలిన రోజుల్లో దిగువకు తరలిస్తున్నారు. ఇలాంటి నీటి చౌర్యంతోనే ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోతోంది. – బాలస్వామి, రైతు, ఆరేపల్లి (ఆత్మకూర్‌)

Advertisement
 
Advertisement
Advertisement