–8లో u
గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బీడు భూ ములను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, కేఎల్‌ఐ, భీమా, నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతలతోపాటు ఆర్డీఎస్ ప్రా జెక్టు పనులు దశాబ్దాలుగా అసంపూర్తిగానే ఉన్నా యి. ప్రాజెక్టుల పూర్తికి నిధుల లేమికి తోడు భూసేకరణ ప్రక్రియ ప్రధాన అడ్డంకిగా మారింది. ము ఖ్యంగా రెండు దశాబ్దాల క్రితం ప్రారంభించిన నెట్టెంపాడు ప్రాజెక్టుకు పదేళ్లుగా నిధులు లేకపోవడంతోపాటు భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగ డం లేదు. అదేవిధంగా ఎనిమిదేళ్ల క్రితం చేపట్టిన గట్టు ఎత్తిపోతల కుడి, ఎడమ కాల్వల పరిధిలో 461 ఎకరాల భూసేకరణలో జరుగుతున్న జాప్యం పనులకు అడ్డంకిగా మారింది. ఆర్డీఎస్ ప్రాజెక్టు పరిధిలో నిర్మించాల్సిన మల్లమ్మకుంట రిజర్వాయ ర్ కోసం 567 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది.
6–7 లక్షల ఎకరాలకు మాత్రమే..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాల లక్ష్యంతో చేపట్టిన ఆయా ప్రాజెక్టుల ద్వారా కేవలం 6– 7 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. ప్రాజెక్టుల పూర్తిస్థాయి నిర్మాణాలనకు భూ సేకరణ ప్రక్రియ అడ్డంకిగా మారడంతో లక్ష్యం నెరవేరడం లేదు. దీనిపై దృష్టిసారించిన ప్రభుత్వం.. భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, పనులు పూర్తిచేసేలా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ శివకుమార్‌నాయుడు ఇటీవల గద్వాల జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణపై ప్రత్యేకంగా సమీక్షించారు. భూ సేకరణ ప్రక్రియ త్వరగా పూర్తిచేసి.. పెండింగ్ పనులు పూర్తిచేయాలని ఇరిగేషన్, రెవెన్యూశాఖ అధికారులను ఆదేశించారు.
ఇదీ పరిస్థితి..
గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 2లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన నెట్టెంపాడు ప్రాజెక్టు.. కేవలం 1.45 లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఈ ప్రాజెక్టు 99, 100 ప్యాకేజీల పరిధిలో 541 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది.
2018లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఎత్తిపోతల కుడి, ఎడమ కాల్వల పరిధిలో 249 ఎకరాలు, రిజర్వాయర్ నిర్మాణానికి మరో 212 ఎకరాలు అవసరం. భూసేకరణ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది.
87,500 ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన ఆర్డీఎస్ ప్రాజెక్టు.. అంతర్రాష్ట్ర జలవివాదం కారణంగా వానాకాలంలో గరిష్టంగా 50వేల ఎకరాలకు మించి సాగునీరు అందిన పరిస్థితి లేదు. దీంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాజోళి మండలంలో మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే రిజర్వాయర్ నిర్మాణానికి 567 ఎకరాలు సేకరించాల్సి ఉండగా.. భూములు ఇచ్చేందుకు స్థానిక రైతులు అభ్యంతరం చెబుతుండటంతో పనులకు అడ్డంకిగా మారింది.
పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు సైతం వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో సివిల్, మెకానికల్ పనులతోపాటు భూసేకరణ సమస్య నెలకొంది.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా.. రెండు దశాబ్దాలుగా పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఇక్కడ సుమారు 130 ఎకరాల వరకు భూమి సేకరించాల్సి ఉంది. అసంపూర్తి పనులతో కేవలం 2.50 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు పారుతుంది.
4లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన భీమా ఎత్తిపోతల పథకం పనులు రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లోనే ఉన్నాయి.
వేగవంతం చేస్తాం..
నెట్టెంపాడు, ఆర్డీఎస్, గట్టు ఎత్తిపోతల పథకాలకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ కొంత పెండింగ్‌లో ఉంది. దీనిపై ఇటీవలి ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ సమీక్షించారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న భూమిని సేకరించాలని చెప్పారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయితే పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందించవచ్చు. పెండింగ్‌లో ఉన్న భూేమిని వేగవంతంగా సేకరించేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకెళ్తాం.
– రహీముద్దీన్, ఎస్‌ఈ, ఇరిగేషన్‌శాఖ
సాగునీటి ప్రాజెక్టులకుభూ సేకరణ సమస్య
ముందుకు సాగని పెండింగ్ పనులు
భూసేకరణ పూర్తయితేనే పూర్తి ఆయకట్టుకు సాగునీరు
ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ సమీక్ష
త్వరితగతిన చేపట్టాలని ఆదేశం


