గట్టు: యూరియాను యాప్ ద్వారానే విక్రయించాలని గద్వాల డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు సంగీతలక్ష్మి సూచించారు. బుధవారం గొర్లఖాన్‌దొడ్డి రైతువేదికలో గట్టు, మల్దకల్ మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన ఎరువుల దుకాణ దారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వచ్చే వానాకాలం నాటికి రైతులకు ఎరువుల కొరత లేకుండా ఎరువుల దుకాణదారులు తగినంత ఎరువుల స్టాకులో పెట్టుకోవాలన్నారు. ఎరువుల నిల్వకు సంబంధించి ఏ రోజుకు ఆరోజు స్టాకు రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని కోరారు. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు హనుమంతురెడ్డి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


