కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
గద్వాల వ్యవసాయం: ఐకేపీ మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెంకటోనిపల్లి కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, నదిఅగ్రహారం కేంద్రాన్ని పీఏసీఎస్ చైర్మన్ సుభాన్, జమ్మిచేడు కేంద్రాన్ని అక్కడి మహిళా సంఘాల ప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, పీఏసీఎస్ చైర్మన్ సుభాన్ వేరువేరుగా మాట్లాడుతూ.. రైతులు దళారులకు ధాన్యం విక్రయించి మోసపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు. సన్న రకానికి బోనస్ రూ.500 ప్రభుత్వం ఇస్తోందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రతాప్‌గౌడ్, నాయకులు రమేష్‌నాయుడు, మహేశ్వర్‌రెడ్డి, మెప్మా అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


