చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
గద్వాలటౌన్: పట్టుదల, శ్రద్ధ అనేది క్రీడల వల్ల అలవడతాయని, ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలలో రాణించాలని జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి (డీవైఎస్‌ఓ) కృష్ణయ్య పేర్కొన్నారు. స్థానిక ఇండోర్ స్టేడియంలో కబడ్డీ శిక్షణ ఉత్సాహంగా సాగుతుంది. ఆదివారం కబడ్డీ శిక్షణ శిబిరాన్ని డీవైఎస్‌ఓ కృష్ణయ్య సందర్శించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని, తగు సూచనలు చేశారు. అనంతరం క్రీడాకారులనుద్దేశించి ఆయన మాట్లాడారు. గెలుపు ఓటముల కంటే పోటీల్లో క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడం ప్రధానమని, జాతీయ స్థాయిలను లక్ష్యంగా చేసుకుని రాణించాలన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు పండ్లు, గుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి నర్సింహా, సంయుక్త కార్యదర్శి జగదీష్, మహేష్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.


