ప్రాజెక్టులు పూర్తి చేసుకుందాం | - | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులు పూర్తి చేసుకుందాం

Nov 4 2025 7:08 AM | Updated on Nov 4 2025 7:08 AM

ప్రాజ

ప్రాజెక్టులు పూర్తి చేసుకుందాం

జోగుళాంబ గద్వాల

స్పెల్‌బీకి విశేష స్పందన

ఉమ్మడి జిల్లాలోని ఆయా పాఠశాలల్లో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పెల్‌బీ పోటీ పరీక్షలకు అనూహ్య స్పందన లభించింది.

మంగళవారం శ్రీ 4 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

–10లో u

సాక్షి, నాగర్‌కర్నూల్‌/ అచ్చంపేట రూరల్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అందరూ ఏకమవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కృష్ణానదిలో రాష్ట్ర వాటాను తేల్చకపోవడంతోనే ఉమ్మడి పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగిందని, ఇన్నేళ్లలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తికాలేదన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుతో పాటు ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు గ్రీన్‌చానల్‌ ద్వారా త్వరితగతిన నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ అవుట్‌ లెట్‌ టన్నెల్‌ వద్ద హెలీబోర్న్‌ ఎలక్ట్రో మాగ్నటిక్‌సర్వేను ప్రారంభించారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, బాలునాయక్‌తో కలసి హెలీకాప్టర్‌లో సర్వే పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్జీఆర్‌ఐ నిపుణులు ప్రకాశ్‌కుమార్‌, సత్యనారాయణ హెలీబోర్న్‌ ఎలక్ట్రో మాగ్నటిక్‌ సర్వే విధానంపై సీఎంకు వివరించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతం కావడంతో పులులు, వన్యప్రాణులకు ఇబ్బంది కలుగకుండా అత్యంత జాగ్రత్తలతో ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పనులను చేపడతామని తెలిపారు. తక్కువ ఖర్చుతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.

ఇదే మంచి అవకాశం..

మ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకునేందుకు ఇదే మంచి అవకాశమని అన్నారు. ఈ జిల్లా నుంచి సీఎంగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం కావాలన్నారు. ఇక్కడ పుట్టినవారు కాకుండా ఇంకెవరూ ఈ మట్టి గురించి ఆలోచించరని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులను సాధించుకునేందుకు ఇక్కడి ప్రజలంతా ఏకమై ఉండాలని కోరారు. కృష్ణానదిలో రాష్ట్ర వాటా కోసం సుప్రీంకోర్టు, ట్రిబ్యూనళ్లలో పోరాటం కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఇక్కడి ప్రాజెక్టులను పూర్తిచేసుకోకపోతే ప్రజలు తమకిచ్చిన అధికారానికి అర్థం లేదన్నారు. నారాయణపేట–కొడంగల్‌ ప్రాజెక్టుకు గతంలోనే ప్రతిపాదనలు పంపినా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాకే ప్రాజెక్టు పనులు మొదలుపెట్టామని చెప్పారు.

నక్కలగండి పునరావాస

బాధితులకు న్యాయం చేస్తాం..

క్కలగండి రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ డిసెంబర్‌ 31లోగా నిర్వాసితులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రిజర్వాయర్‌ బ్యాక్‌వాటర్‌తో పంట నష్టానికి గురైన మార్లతండా, కేశతండా గ్రామస్తులకు ప్రభుత్వం తరపున పరిహారం చెల్లించి ఆదుకుంటామన్నారు. ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై మరోసారి జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ ఆదర్శ సురభి, డీఐజీ చౌహాన్‌, ఎస్పీ వైభవ్‌ గైక్వాడ్‌, సీఈలు విజయ్‌కుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇలాంటి ప్రాజెక్టు ఎక్కడా లేదు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఎస్‌ఎల్‌బీసీ లాంటి ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా ఈ ప్రాజెక్టును చేపట్టామని చెప్పారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంలో 8 మంది మరణించడం దురదృష్టకరమైన సంఘటన అని గుర్తు చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు అందజేశామన్నారు. ముఖ్యమంత్రితో పాటు తాను ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు 30 సార్లు సమీక్షించామని చెప్పారు.

ఇలాంటి సీఎం ఉండటం మన అదృష్టం మంత్రి కోమటిరెడ్డి

సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు స్వయంగా పర్యవేక్షించి, సమీక్షిస్తున్న సీఎం ఉండటం అదృష్టంగా భావిస్తున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఫ్లోరైడ్‌ భూతం నుంచి 30 లక్షల మంది ప్రజల ప్రాణాలకు రక్షణగా ఉండే ఈ ప్రాజెక్టు కోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారని చెప్పారు.

భూనిర్వాసితులను ఆదుకుంటాం ఎమ్మెల్యే వంశీకృష్ణ

నక్కలగండి ప్రాజెక్ట్‌లో ముంపునకు గురైన మర్లపాడుతండా, కేశ్యాతండా నిర్వాసితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ సీఎంను కోరారు. 2017 నుంచి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పరిహారం పెండింగ్‌లో ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తుఫాన్‌, వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామన్నారు. అచ్చంపేట మండలంలోని శివారు గ్రామాల నుంచి దేవరకొండ వైపు వెళ్లేందుకు హైలెవల్‌ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.

ఇక్కడ పుట్టిన వారు కాకపోతే ఇంకెవరూ చేయరు

నేను సీఎంగా ఉన్నప్పుడే

అన్ని సమస్యలకు పరిష్కారం

కృష్ణానీటిలో వాటా కోసం

గట్టిగా పోరాడతాం

తక్కువ ఖర్చుతో ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేస్తాం

గ్రీన్‌చానల్‌ ద్వారా ప్రాజెక్టులకు నిధులు

డిసెంబర్‌ 31లోగా నక్కలగండి నిర్వాసితులకు పరిహారం

ఎస్‌ఎల్‌బీసీ అవుట్‌ లెట్‌ వద్ద

హెలీబోర్న్‌ ఎలక్ట్రో మాగ్నటిక్‌ సర్వేను

ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

ప్రాజెక్టులు పూర్తి చేసుకుందాం1
1/1

ప్రాజెక్టులు పూర్తి చేసుకుందాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement