
పత్తి కొనుగోళ్లలో కొత్త విధానం
ఉండవెల్లి: పత్తి కొనుగోలు, అమ్మకాల్లో అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు ప్రత్యేక యాప్ కపాస్ కిసాన్‌ను తీసుకొచ్చిందని, దీని ద్వారానే సీసీఐ కొనుగోళ్లు చేపట్టనుందని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈమేరకు గురువారం ఉండవెల్లి రైతువేదికలో వీసీ నిర్వహించారు. రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు వీసీ నిర్వహించగా.. అలంపూర్ డివిజన్ స్థాయి అధికారులు, ఉండవెల్లి, మానవపాడు, రాజోళి, అలంపూర్, వడ్డేపల్లి, అయిజ, ఇటిక్యాల, ఎర్రవల్లి మండలాలకు చెందిన వ్యవసాయ అధికారులు, ఏఈఓలు పాల్గొన్నారు. పత్తి కొనుగోలుకు ప్రత్యేక యాప్ ద్వారా రైతులు స్లాట్ బుక్ చేసుకుని అమ్మకాలు జరుపుకునేలా చర్యలు తీసుకుంటున్నారని, పంట నమోదును త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.