
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గద్వాల/అయిజ:: మున్సిపల్ కార్మికుల రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి మున్సిపల్ కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ పార్టీ కార్యాలయంలో మహాసభల పోస్టర్ విడుదల చేశారు. ఈనెల 14,15వ తేదీలలో రంగారెడ్డి జిల్లా తుర్కియాంజిల్‌లో రెండురోజుల పాటు రాష్ట్ర మహాసభలు జరుగనున్నట్లు తెలిపారు.
జిల్లా మహాసభలను..
అదేవిధంగా, ఈనెల 17న అలంపూర్ చౌరస్తాలో నిర్వహించనున్న సీఐటీయూ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని వెంకటస్వామి కోరారు. సోమవారం అయిజలో తెలంగాణ పబ్లిక్, ప్రయివేటు రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రవాణా రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, 2019 మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని, ఆటోల అడ్డాలకు స్థలాలు కేటాయించాలని కోరారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.12వేలు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి వివి నరసింహ, కార్మికులు మురళి, మల్దకల్, రవి, బీసన్న, శివ, కర్రెప్ప, నాగరాజు, చిన్న, శ్రీను, దావీదు, ఆనందం, సులోమన్ తదితరులు పాల్గొన్నారు.