
సమీకృత వ్యవసాయంతో సుస్థిర లాభాలు
శాంతినగర్: వ్యవసాయ పంటలతోపాటు అను బంధ సంస్థలపై దృష్టిసారిస్తే రైతులు లాభాల బాటపడతారని ఉద్యానవనశాఖ జిల్లా అధికారి ఎంఏ.అక్బర్ అన్నారు. శుక్రవారం వడ్డేపల్లి మండలంలోని రామాపురం గ్రామ రైతు వేదికలో వర్షాధార ప్రాంత అభివృద్ధి ప్రోగ్రాంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండ్ల తోటలు, కూరగాయలతోపాటు పాడిపరిశ్రమ, పశువుల పోషణ, చేపల పెంపకం వంటి సమీకృత వ్యవసాయ పద్ధతులను రైతులు అవలంభిస్తే మంచి దిగుబడులు సాధించి వ్యవసాయం లాభసాటిగా వుంటుందన్నారు. కార్య క్రమంలో డివిజినల్ ఉద్యానవన అధికారి పి. ఇమ్రానా, ఏఈఓ రామనాయుడు, హెచ్‌ఈఓ శివకుమార్, యశ్వంత్, రైతులు పాల్గొన్నారు.
కూరగాయల సాగుతో..
మల్దకల్: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు ప్రతి రైతు కూరగాయల సాగు చేయాలని జిల్లా ఉద్యానవనశాఖ అధికారి అక్బర్ తెలిపారు. శుక్రవారం మండలంలోని కుర్తిరావులచెర్వు రైతువేదికలో రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతులు వరి, మొక్కజొన్న, పత్తి, మిరప పంటలతో పాటు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందేందుకు రైతులు కూరగాయల సాగును ఎంచుకోవాలన్నారు. రసా యనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువుల వాడకంను పెంచాలన్నారు. అలాగే, పండ్లతోటల సాగుపై రైతులు అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రభుత్వం పండ్లతోటల సాగుకు అందిస్తున్న ఆర్థికసాయంను సద్వినియోగం చేసుకుని సాగు పెంచాలన్నారు.
క్రీడా క్యాలెండర్‌నుఆవిష్కరించిన వీసీ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలో 2025–26 విద్యాసంవత్సంలో జరిగే వివిధ క్రీడలకు సంబంధించిన వార్షిక క్యాలెండర్‌ను వీసీ శ్రీనివాస్ శుక్రవారం పీయూ అడ్మినిస్ట్రేషన్ భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ నెలల్లో నిర్వహించే క్రీడల వివరాలతో క్రీడా క్యాలెండర్ రూపొందించామని, దీని వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. ఆయా తేదీల ఆధారంగా విద్యార్థులకు క్రీడలకు సిద్ధం అయ్యేందుకు ఆస్కారం ఉందన్నారు. విద్యార్థులు క్రీడల్లో చురుకుగా పాల్గొడం వల్ల శారీరక, మానసిక ఎదుగుదల ఉంటుందని, భవిష్యత్‌లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కంట్రోలర్ ప్రవీణ, ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి, పీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సమీకృత వ్యవసాయంతో సుస్థిర లాభాలు