
పత్తి రైతు ఆశలు ఆవిరి..
● 4 ఎకరాల్లో పత్తి పంట తొలగింపు
ఉండవెల్లి: మండలంలోని చిన్న ఆముదలపాడు శివారులో రైతు కొండన్న 4 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశాడు. దాదాపు పంటను సాగు చేసినప్పటి నుంచి రూ.లక్ష వరకు ఖర్చు అయ్యింది. ఇటీవల పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలు కురవడంతో పంట మొత్తం దెబ్బతిన్నది. చేసేది లేక.. శుక్రవారం ట్రాక్టర్‌తో పంటను తొలగించాడు. జిల్లాలో పత్తి సాగు చేసిన రైతులది అందరిదీ ఇదే పరిస్థితి అని, పంట తొలగించినా పట్టించుకునే అధికారులు లేరని, ప్రభుత్వం స్పందించి పత్తి పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని బాధిత రైతు కోరాడు.

పత్తి రైతు ఆశలు ఆవిరి..