
రేపటి నుంచి బీచుపల్లిలో పవిత్రోత్సవాలు
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో 6వ తేదీ నుంచి 9వ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా 6న విశ్వకేశ ఆరాధన, పుణ్యహం, రక్షాబంధనం, 7న మంగళవాయిద్యాల నడుమ పవిత్ర గ్రామ ప్రదక్షణం, వేద ప్రబంధ పారాయణం, 8న మూల మూర్తి హోమాలు, పూర్ణాహుతి, అనంతరం సామూహిక వరలక్ష్మి వ్రతాలు, 9న లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం, ఉత్సవ పరిసమాప్తి, వేద ఆశీర్వచనం వంటి కార్యక్రమాలతో ఉత్సవాలు ముగియనున్నట్లు తెలిపారు.
శివాలయంలో ప్రత్యేక పూజలు
బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని శివాలయంలో సోమవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శ్రావణమాసం అందులోనూ రెండో సోమవారం కావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయాన్నే అధిక సంఖ్యలో ప్రజలు బీచుపల్లికి చేరుకొని కృష్ణానదిలో స్నానాలు ఆచరించి శివుడిని దర్శించుకొన్నారు.

రేపటి నుంచి బీచుపల్లిలో పవిత్రోత్సవాలు