
1.73 లక్షల ఎకరాల్లో పంటలు సాగు
మే నెలలో వర్షాలు కురవడంతో మెట్ట పంటలు సాగుచేసుకునేందుకు రైతులు భూములు దుక్కులు దున్నుకుని సిద్ధం చేసుకున్నారు. మృగశిరకార్తిలో పత్తి, వేరుశనగ, ఆముదం, మొక్కజొన్న, కందులు వంటి వివిధ రకాల పంటలు సాగుచేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో మొత్తం 1,73,211 ఎకరాల్లో పంటలు సాగుచేయగా ఇందులో 1.50 లక్షల ఎకరాల్లో మెట్టపంటలు సాగుచేశారు. ఈ పంటలన్ని కూడా పూర్తిగా వర్షాధారంగానే పండుతాయి. ఇదిలాఉండగా, సాధారణంగా జూన్ చివర, జూలై మాసంలో సమృద్ధిగా వర్షాలు మొదలవుతాయి. అయితే ఈ సారి మే నెలలోనే వర్షాలు కురిశాయి. మే నెలలో జిల్లా వ్యాప్తంగా 117.3మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వాస్తవానికి మే నెలలో సాధారణ వర్షపాతం 25.8 మి.మీటర్లు కురవాల్సి ఉండగా.. అధికంగా కురిసింది.