
సీఎం సార్.. మా సమస్యలు పట్టించుకోండి
గట్టు : గట్టులోని ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు సీఎం రేవంత్‌రెడ్డికి పోస్టుకార్డుల ద్వారా విన్నవించారు. హై స్కూల్‌లో నెలకొన్న సమస్యలపై విద్యాశాఖ అధికారులకు పలు మార్లు విన్నవించినా సమస్యను పరిష్కరించకపోవడంతో విద్యార్థులు సోమవారం నేరుగా సీఎం రేవంత్‌రెడ్డికు సమస్యలను పోస్టుకార్డు ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో పోస్టు కార్డులను పంపారు. పాఠశాల విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు హలీంపాష డిమాండ్ చేశారు. పీడీ పోస్టు ఖాళీగా ఉందని, ఉపాధ్యాయుల కొరత, గదుల కొరత చాలా ఉందని తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గట్టు హైస్కూల్ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాంఢ చేశారు.