
అయ్యో దేవుడా!
ముంపునకు
గురైన ‘ఆలూరు’
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా ర్యాలంపాడు రిజర్వాయర్ నిర్మాణంలో ఆలూరు గ్రామం ముంపునకు గురైంది. 2016లో ర్యాలంపాడు రిజర్వాయర్‌ను పూర్తి స్థాయి 4 టీఎంసీల నీటిని నింపడంతో ఆలూరు గ్రామస్తులు గ్రామాన్ని ఖాళీ చేసి, పునరావాస కేంద్రంలోకి మకాం మారారు. ముంపు గ్రామస్తులకు అప్పట్లో బింగిదొడ్డి తండా సమీపంలో ప్రభుత్వం 130 ఎకరాల్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి, 1,452 మందికి ప్లాట్లను కేటాయించింది. ఆలూరు ముంపు గ్రామస్తులతో పాటుగా ఆలయాలకు ప్రభుత్వం పరిహారాన్ని అందజేసింది. ఇక్కడి గ్రామస్తుల ప్రధాన దైవం ఆంజనేయస్వామి, శివాలయం. ఆలయాలకు ప్రభుత్వం సుమారుగా రూ.28 లక్షల పరిహారం అందజేస్తే.. బ్యాంకులో దాచుకున్న ఆ డబ్బులు ఇప్పుడు రెట్టింపయ్యాయి. ఈ నిధులు రూ. 50 లక్షలకు చేరాయి. రెండున్నర నెలల క్రితమే ఆలూరు పునరావాస కేంద్రంలో ఆంజనేయస్వామి, శివాలయాల నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లను పిలిచి పనులు అప్పగించింది. పనులు ఇప్పటికి ప్రారంభం కాలేదు.
ఆలూరు గ్రామంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న 10 శాతం ఖాళీ స్థలంలో ఆంజనేయస్వామి, శివాలయంలో పాటుగా వాల్మీకి, కనకదాసుల విగ్రహాలు రేకుల మధ్య గుడిసెల్లో పూజలందుకుంటున్నారు. ఇక్కడి ఆంజనేయస్వామి జాతరను ప్రతి ఏటా జనవరిలో గ్రామస్తులు నిర్వహిస్తుంటారు. అయితే ఇక్కడ ఆలయ నిర్మాణం కోసం 6 పాట్లను కేటాయించారు. మిగతా దాంట్లో కొందరికి ప్లాట్లను కేటాయించిన నేపథ్యంలో వివాదం నెలకొంది. ఈ స్థలం మొత్తంలో ఆలయ నిర్మాణంతోపాటుగా జాతర, వివాహాది శుభకార్యాయాలు జరుపుకొనేందుకు అనువుగా ఆలయంతో పాటుగా ఖాళీ స్థలం ఉండాలని కొందరు పట్టుబట్టారు. ఈ పురనరావాస కేంద్రంలో రెండు చోట్ల పబ్లిక్ పర్పస్ కోసం బస్టాండ్ దగ్గర 3 ఎకరాలు, గ్రామం మధ్యలో 3 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇందులో కొంత మేరకు అన్యాక్రాంతం అయినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బస్టాండ్ పక్కనే ఉన్న మొత్తం ఖాళీ స్థలం మొత్తం దేవాలయాలు, గ్రామంలో నిర్వహించే శుభకార్యాలు, ఉత్సవాల కోసం అలానే ఉంచాలని మరికొందరు గ్రామస్తులు పట్టుపడుతుడుతున్నారు. ఆలయానికి కావాల్సిన 6 ప్లాట్లు సరిపోతాయని, మిగిలినవి లోతట్టు ప్రాంతంలో కట్టడాలకు పనికి రాని చోట కేటాయించిన వారికి ప్లాట్లను ఇవ్వాలని మరి కొందరంటున్నారు. ఆలయ నిర్మాణంపై గ్రామస్తుల్లో ఏకాభిప్రాయం లేని కారణంగా ఆలయాల నిర్మాణంపై ప్రభావం పడింది.
రూ.లక్షలు ఉన్నా పూరి గుడిసెల్లోనే పూజలందుకుంటున్న దేవుళ్లు
గట్టు: ఏ ఊరిలో అయినా పెళ్లి లేదా.. పండుగ.. ఇలా ఏ శుభకార్యమైనా మొదట ఆలయానికి వెళ్లి అంతా మంచి జరగాలంటూ దేవుడికి మొక్కులు చెల్లించుకుంటుంటారు. కానీ, ఆ ఊరిలో మాత్రం ఏళ్లుగా ఆలయాల నిర్మాణానికి నోచుకోక దేవుళ్లు పూరి గుడిసెలోనే ఉండిపోవడంతో గ్రామస్తులు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలయాలను పక్క గ్రామాలకు వెళ్లి చేయించుకునే పరిస్థితి నెలకొంది. చివరికి ఏటా ఘనంగా జరుపుకొనే జాతర సైతం కల తప్పినట్లయ్యింది. గట్టు మండలం ఆలూరు పునరావాస కేంద్రంలో నెలకొన్న విచిత్ర పరిస్థితి ఇదీ. ఆలూరులోని దేవుళ్ల పేరిట బ్యాంకుల్లో రూ.లక్షలు ఉన్నా ఆలయ నిర్మాణానికి మాత్రం నోచుకోవడేంలేదు. రెండున్నర ఏళ్ల క్రితం టెండర్లు పిలిచి పనులు అప్పగించినా.. నేటికీ ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. అటు ఆలయాల నిర్మాణాలు చేపట్టక.. రేకుల గుడిసెలో దేవుడు తలదాచుకుంటూ పూజలందుకునే పరిస్థితి నెలకొంది.
ఆలూరు గ్రామంలో ఆలయాలు లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. శుభకార్యాయాలు, పెళ్లిళ్లు జరుపుకోవాలన్నా ఆరు బయటే జరుపుకోవాల్సిందే. దేవుడి దీవెనల కోసం పూరి గుడిసెలో ఉన్న స్వామి వారిని దర్శించుకునే పరిస్థితి గ్రామంలో ఇప్పటికి కొనసాగుతోంది. గ్రామంలో ఆలయాల నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో ఇప్పటికి పండుగలు, వివాహాది శుభకార్యాయాలు నిర్వహించుకునే సందర్భంలో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామానికి కొత్తగా వచ్చిన వారు గ్రామంలో ఆలయాలు లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పట్టువిడుపులు మాని ఆలయ నిర్మాణానికి అధికారులు, ప్రజా ప్రతి నిధులు కృషి చేయాలని ఆలూరు గ్రామస్తులు కొరుతున్నారు.
ఆలూరులో వివాదాస్పదంగా
మారిన ఖాళీ స్థలం ఇదే..
త్వరలో నిర్మాణాలు
చేపడతాం
పునరావాస కేంద్రంలో ఆలయ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. ఆలయంతో పాటుగా వివిధ నిర్మాణాలకు మరిన్ని నిధులు రావాల్సి ఉంది. వీటిపై సమీక్షించి, ఏడాదిలోపు నిర్మాణాలను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటాం.
– లక్ష్మీనారాయణ, అడిషనల్ కలెక్టర్
ఆలయం నిర్మించాలి
ఆలూరు పునరావాస కేంద్రంలో నూతన ఆలయాల నిర్మాణం చేపట్టని కారణంగా ఇబ్బంది పడుతున్నాం. పెళ్లిళ్లను ఊరిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో చేసుకునే పరిస్థితి నెలకొంది. దేవుళ్లను గుడిసెల్లోనే పూజించుకుంటున్నాం. బస్టాండ్ పక్కనే ఉన్న 10 శాతం ఖాళీ స్థలం ఆలయాలు, ఫంక్షన్ హాల్, పబ్లిక్ పార్కు కోసం కేటాయించాలి. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి పునరావాస కేంద్రంలో నూతన ఆలయాలను నిర్మించాలి. – మహేష్‌గౌడ్, ఆలూరు
●
ప్లాట్ల కేటాయింపు
వివాదం
ఆలూరు పునరావాస కేంద్రంలో ఆలయాల నిర్మాణాలకు గ్రహణం
ఆలయాల పేరిట బ్యాంకులో మూలుగుతున్న రూ.50 లక్షలు
రెండున్నరేళ్ల క్రితమే నిర్మాణానికి టెండర్లు
ఎటూ తేలని 10 శాతం స్థలంలో ప్లాట్ల పంచాయితీ

అయ్యో దేవుడా!

అయ్యో దేవుడా!