చేనేత కార్మికులకు కేంద్రమంత్రి సన్మానం | - | Sakshi
Sakshi News home page

చేనేత కార్మికులకు కేంద్రమంత్రి సన్మానం

Aug 4 2025 3:53 AM | Updated on Aug 4 2025 3:53 AM

చేనేత

చేనేత కార్మికులకు కేంద్రమంత్రి సన్మానం

గద్వాల: నేషనల్‌ డెవ్‌లప్‌మెంట్‌ హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ ఆధ్వర్యంలో వీవర్‌ సర్వీసింగ్‌ సెంటర్‌ ద్వారా ఎలక్ట్రానిక్‌ జాకార్డ్స్‌ సబ్సిడీపై లబ్ధిపొందిన గద్వాలకు చెందిన ఎనిమిది మంది చేనేత కార్మికులను కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సన్మానం చేశారు. ఆదివారం ఎన్‌హెచ్‌డీసీ వారు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చేనేత కార్మికులు శ్రీహరి, శివశంకర్‌, శ్రీను, సరిత, హిమబిందు, మల్లిఖార్జున్‌, వెంకటేష్‌, రాధను కేంద్రమంత్రి మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో నిఫ్ట్‌ డైరెక్టర్‌ మాలిని, అక్కల శాంతారాం, హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

దేశభక్తి చాటుదాం

గద్వాల: విజ్ఞానం, వినోదం, వికాసం, ఆటపాటలు వ్యాయమం వంటి శారీరక శ్రమ తగ్గిపోతున్న తరుణంలో విద్యార్థి దశలోనే ప్రతిభ పోటీలు నిర్వహించి వారిలో మనోవికాసాన్ని పెంపొందించేందుకు దోహదపడుతాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిభపోటీలకు సంబంధించిన కరపత్రాన్ని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తిని చాటుదాం అనే నినాదంతో ప్రజానాట్యమండలి వాళ్లు చేపడుతున్న ఈ ప్రతిభపోటీలు మంచి కార్యక్రమం అన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్‌రెడ్డి, ఆశన్న, నాయకులు విజయ్‌, రాజశేఖర్‌, ఖలీల్‌ పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలి

మల్దకల్‌ : మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడుచుకుంటూ దైవ భక్తిని పెంపొందించుకోవాలని త్రిదండి దేవనాథ జీయర్‌ స్వామి భక్తులకు సూచించారు. ఆదివారం మండలంలోని అమరవాయిలో ఏర్పాటు చేసిన వెంకట్రామిరెడ్డి పరమావధి కార్యక్రమానికి త్రిదండి దేవనాథ జీయర్‌స్వామి హాజరై భక్తులకు వేదర్వశీచనాలు అందజేసి ప్రవచనాలు వినిపించారు. ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో నడుచుకోవాలన్నారు. భగవద్గీత ద్వారా సమాజంలో ఉన్న కులమతాలను రూపుమాపడానికి ప్రజల మధ్య ఉన్న అసమానతలను తొలగించడానికి సర్వమతాలకు దేవుడు ఒక్కడేనని, ప్రజలలో దైవ భక్తిని పెంపొందించడానికి ఎంతో దోహదపడుతుందన్నారు. భక్తులు ఆధ్యాత్మికతను అలవరచుకోవడం వలన జీవితంలో రాణించి ఉన్నత స్థానాలను చేరుకునే వీలుంటుందన్నారు. భగవంతుని చేరడానికి నాలుగు మార్గాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో కరుణాకర్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి

గద్వాల: సీపీఎస్‌ రద్దు– ఓపీఎస్‌ అమలు కోసం పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 1వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరాపార్కులో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంఘం నాయకులు తిమ్మారెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పీఆర్‌టీయూ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టిన సీపీఎస్‌ రద్దును వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో భాగంగా సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ ని వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ డిమాండ్‌ను కోరుతూ పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 1వ తేదీన హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేపడుతున్నట్లు, కార్యక్రమంలో ఉపాధ్యాయులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో యూనియన్‌ నాయకులు వేణుగోపాల్‌, నర్సింహారెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, వెంకట్‌నాయుడు, జాహేద్‌, రవిప్రకాష్‌రెడ్డి, ఎల్లస్వామి, గోవిందు తదితరులు పాల్గొన్నారు.

చేనేత కార్మికులకు  కేంద్రమంత్రి సన్మానం 
1
1/2

చేనేత కార్మికులకు కేంద్రమంత్రి సన్మానం

చేనేత కార్మికులకు  కేంద్రమంత్రి సన్మానం 
2
2/2

చేనేత కార్మికులకు కేంద్రమంత్రి సన్మానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement