
ఎరువులు అధిక ధరకు విక్రయిస్తే చర్యలు
మల్దకల్: ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని డీఏఓ సక్రియానాయక్ ఫర్టిలైజర్ షాపు నిర్వాహకులను హెచ్చరించారు. మంగళవారం పాల్వాయి గ్రామంలోని ఫర్టిలైజర్ షాపును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎరువులను విక్రయించిన వెంటనే రశీదులను ఇవ్వాలని, విత్తనాలు కొనుగోలు చేసే రైతులు తప్పనిసరిగా షాపు యజమానులతో రశీదులు పొందాలన్నారు. ఫర్టిలైజర్ షాపులలో ఈ – పాస్‌మెషిన్ ద్వారానే మందులు పంపిణీ చేపట్టాలని, స్టాక్ వివరాలను రికార్డులలో పొందుపరచాలన్నారు. అనుమతులు లేని ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయఽ అధికారి రాజశేఖర్, ఫర్టిలైజర్ షాపు నిర్వాహకులు పాల్గొన్నారు.