
సాగు.. సగమే!
3.21 లక్షల ఎకరాలకు.. 1.61 ఎకరాల్లోనే వ్యవసాయ పంటల సాగు
వానాకాలం పంటల వివరాలిలా.. (ఎకరాల్లో)
పంట సాగు అంచనా సాగు చేసింది
పత్తి 1,42,410 1,27,884
వరి 95,762 5,644
కంది 42,585 15,224
మొక్కజొన్న 12,887 7,144
వేరుశనగ 11,180 2,495
పొగాకు 10,878 2,300
ఆముదాలు 1,031 201
మినుములు 1,160 132
సజ్జ 450 54
జొన్న 184 30
కొర్ర 503 15
చెరుకు 318 10
ఇతర పంటలు 1,454 0
గద్వాల వ్యవసాయం: నడిగడ్డ రైతులకు ఈ ఏడాది కలిసిరాలేదు. (2025–26) వానాకాలం సీజన్‌కు ముందు మే నెలలో వర్షాలు కురిశాయి. దీంతో అన్నదాతలు సీజన్ బాగుంటుందని ఆశించారు. అయితే ఆ తర్వాత వరుణుడు ఆశించిన స్థాయిలో కరుణించకపోవడంతో సాగుకు కష్టాలు వచ్చాయి. జిల్లాలో 3,21,305 ఎకరాల్లో వ్యవసాయ పంటలు సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేయగా ఇప్పటివరకు సగమే సాగు కాగా, 45,906 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు అంచనా ఉండగా ఇప్పటి వరకు పది శాతం అయ్యింది.
గడిచిన ఏడాది సాఫీగా సాగు
గడిచిన ఏడాది (2024–25) వానాకాలం, యాసగి సీజన్‌లలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిశాయి. జూన్, జులై, ఆగస్టు నెలల్లో వర్షాలు బాగా పడ్డాయి. దీనివల్ల బోర్లు, బావులు రిజార్జ్ అయ్యాయి. ఇదే సమయంలో ఎగువన కురిసిన వర్షాల వల్ల జూరాల జలాశయం నుంచి అనుకున్న సమయలో నీటి విడుదల జరిగింది. ఇలా అన్ని పరిస్థితులు అనుకూలించడం వల్ల గడిచినేడాది వానాకాలం సీజన్‌లో అన్ని పంటలు బాగా వచ్చి, దిగుబడులు సైతం బాగా వచ్చాయి.
ఇంకా అవకాశం
గత కొద్ది రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయని పంటలు వేయడానికి ఇంకా అవకాశం ఉందని, అంచనా మేరకు సాగు అవుతుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. జులై నెలాఖరు వరకు కంది, వేరుశనగ, ఆముదం, మొక్కజొన్న పంటలు వేయవచ్చునని అంటున్నారు. వరి పంటకు సంబంధించి ఆగస్టు వరకు సమయం ఉందని చెబుతున్నారు. అదేవిధంగా ఉధ్యాన పంటలకు సంబందించి కూరగాయలు, ఎండుమిర్చి, ఆయిల్‌పాం సాగుకు వచ్చే నెల వరకు గడువు ఉందన్నారు.
ఎండుమిర్చి 30,305 2262
కూరగాయలు 7650 2543
ఆయిల్‌పాం 3936 0
ఇతర పంటలు 4045 0
ఉద్యానపంటలు
45,906 ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు అంచనా..
నేటికీ 10 శాతం మాత్రమే చేరుకున్న వైనం
ఆశించిన మేర కురవని వర్షాలు
అంచనా మేరకు సాగుకు అవకాశం
జూన్‌లో వర్షాలు లేకపోవడం, బోర్లు, బావులు రీచార్జ్ కాకపోవడం వల్ల వానాకాలం సీజన్ సాగుపై ప్రభావం చూపింది. అయితే చాలా ప్రాంతాల్లో వరి నారుమడులు రైతులు సిద్ధం చేసుకున్నారు. ఆగస్టు వరకు వరి, ఎండుమిర్చి వేయవచ్చు. ఈ నెలాఖరు వరకు పత్తి మినహా కొన్ని పంటలు వేస్తారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉన్నాయి. అంచనా మేరకు పంటలు సాగు అవుతాయని భావిస్తున్నాం. – సక్రియానాయక్, డీఏఓ

సాగు.. సగమే!

సాగు.. సగమే!