
ముగిసిన బాస్కెట్‌బాల్ పోటీలు
అయిజ: తెలంగాణ బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండలంలోని ఉత్తనూరులో ధన్వంతరి వేంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ నాలుగురోజులపాటు నిర్వహించిన జూనియర్ అంతర్ జిల్లా బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్ పోటీలు సోమవారంతో ముగిశాయి. బాలిక విభాగంలో రంగారెడ్డి జట్టు విన్నర్ కాగా మేడ్చేల్ మల్కాజిగిరి జట్టు రన్నర్‌గా నిలిచింది. అదేవిధంగా బాలుర విభాగంలో హైదరాబాద్ జట్టు విన్నర్ కాగా.. మేడ్చల్ మల్కాజిగిరి జట్టు రన్నర్‌గా నిలిచింది. విజేతలకు నిర్వాహకులు షీల్డ్‌లు అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.
హోరీహోరీగా
తలపడుతున్న బాలికల జట్టు