
ఆరుగ్యారంటీలతో ప్రజలను వంచన చేశారు
గద్వాల: అధికారంలోకి రావటానికి అమలు సాధ్యపడని ఆరుగ్యారెంటీల పథకాల పేరుతో అధికారంలోకి వచ్చి తరువాత ప్రజలను వంచన చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచంద్రరావు అన్నారు. ఆదివారం ఆయన గద్వాలలో పర్యటించారు. ముందుగా ఆయన ఉదయం పెద్ద అగ్రహారంలోని అహోబిలం నరసింహస్వామి దేవాలయంలో పూజలు చేసి అనంతరం ఎంపీ డీకేతో కలిసి ప్రైవేటు ఫంక్షన్ హాలులో జిల్లా కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు రూ.15వేలు ఇస్తామని రూ.6వేలకే సరిపెట్టారని, త్వరలో స్థానిక సంస్థలు రానున్నడంతో బీసీ రిజర్వేషన్, రైతుబంధు, రుణమాఫీ అంటూ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు యత్నిస్తున్నారన్నారు. నడిగడ్డ అభివృద్ధి చెందాలంటే అది బీజేపీతోనే సాధ్యమన్నారు. తెలంగాణలో డబుల్‌ఇంజిన్ సర్కార్ వస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు.
అన్ని వర్గాల సంక్షేమానికి కృషి : ఎంపీ డీకే అరుణ
మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ దేశంలో తిరుగులేని నాయకుడు భారత ప్రధాని నరేంద్రమోడీ అని కొనియాడారు. అన్ని వర్గాల సంక్షేమభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నాడన్నారు. రైతులకు కిసాన్ సమ్మాన్ నిధులు, నిరుపేదలకు ఉచితంగా 6కిలోల బియ్యం, ఎరువులను సబ్సిడీ ధరలకు, రైతులకు గిట్టుబాటు ధరలు వంటి అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. ఈ విషయాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి కేంద్రప్రభుత్వం చేస్తున్న సంక్షమాభివృద్ధి పథకాలు వివరించాలన్నారు. రాబోయే 2028లో రాష్ట్రంలో వచ్చేది ఖచ్చితంగా డబుల్‌ఇంజిన్ సర్కారు అని చెప్పారు. నడిగడ్డలో గడచిన పదకొండేళ్లల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు కేవలం కుర్చీలు, అధికారం కోసమే కొట్లాడుతున్నారని విమర్శించారు. అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేసి ఆదిపత్యం ప్రదర్శనలు చేస్తున్నారన్నారు. లోకల్‌బాడీ ఎన్నికల్లో సర్పంచులు, జట్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మున్సిపాలిటీలను గెలుచుకుని బీజేపీ సత్తాచాటాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు డీకే ిస్నిగ్ధారెడ్డి, భరత్‌ప్రసాద్, అప్సర్‌పాషా, రామాంజనేయులు, బండల వెంకట్రాములు, రాంచంద్రారెడ్డి, అక్కలరమాదేవి, రజక జయశ్రీ, పద్మావతి, కృష్ణవేణి, శివారెడ్డి, రాజగోపాల్, జయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచంద్రరావు