
ప్రశాంతంగా జీపీఓ, సర్వేయర్ల పరీక్ష
గద్వాల: గ్రామ పాలనఅధికారి, లైసెన్స్‌డ్ సర్వేయర్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించినట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఉదయం జీపీవో, మధ్యాహ్నం లైసెన్స్‌డ్ సర్వేయర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. జీపీవో పరీక్ష ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, లైసెన్డ్‌స్ సర్వేయర్ పరీక్ష మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగినట్లు తెలిపారు. ఎలాంటి మాస్‌కాపీయింగ్ ఆస్కారం లేకుండా పకడ్బందీగా నిర్వహించినట్లు తెలిపారు. ఉదయం పరీక్షను అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, మధ్యాహ్నం పరీక్షను కలెక్టర్ బీఎం సంతోష్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో అధికారులు రాంచంద్రం, తహసీల్దార్ మల్లిఖార్జున్, ప్రియాంక, రేణుకాదేవి తదితరులు పాల్గొన్నారు.