
బీచుపల్లిని సందర్శించిన టాస్క్‌ఫోర్స్ ఎస్పీ
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని ఆదివారం హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా అభయాంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈఓ రామన్‌గౌడ్ ఆయనను శేషవస్త్రాలతో సత్కరించగా ఆలయ అర్చకులు మారుతిచారి తీర్థ ప్రసాదాలను అందించి ఆలయ వివిష్టత వివరించారు. ఆయన వెంట అర్చకులు అనిల్‌శర్మ, కుటుంబ సభ్యులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.
పెన్షనర్ల సమస్యలుపరిష్కరించాలి
గద్వాల: రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తుందని పెన్షనర్ల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇక్బాల్ పాషా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరికి రాష్ట్ర జేఏసీ నోటీసులు ఇవ్వాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. సీఎంతో జరిపిన చర్చల్లో ఒప్పుకున్న తీర్మానాలను అమలు చేయాలని, సత్వరమే పెండింగ్‌లో ఉన్న పెన్షన్ బెనిఫిట్లు, డీఏలు, పీఆర్‌సీలు, నగదురహిత ఆరోగ్య చికిత్స వంటి హామీలు అమలు చేయాలని కోరారు.
రామన్‌పాడులో
నిలకడగా నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో ఆదివారం సముద్రమట్టానికి పైన 1,020 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కులు, సమాంతర కాల్వ నుంచి 200 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతుండగా.. ఎన్టీఆర్ కాల్వకు 679 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 30 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 872 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు.