
స్వర్ణ మల్లికను ఆదర్శంగా తీసుకోవాలి
గద్వాల క్రైం: గట్టుకి చెందిన సంఘం స్వర్ణ మల్లికను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా జడ్జి ప్రేమలత అన్నారు. బుధవారం జిల్లా బార్ అసోషియేషన్ సమావేశంలో ఇటీవల జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై న మల్లికను బార్ అసోషియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు.కార్యక్రమానికి జిల్లా జడ్జి హాజరై మాట్లాడారు. తండ్రి గట్టు సురేష్ గద్వాల కోర్టులోనే సీనియర్ న్యాయవాదిగా ఉండడం ఎంతో అభినందనీయమన్నారు. జిల్లా చరిత్రలో మహిళ న్యాయమూర్తిగా ఎంపిక కావడం మొదటిసారన్నారు. అక్షరాభ్యాసంలో వెనుకబడిన గట్టు మండలం నుంచి మల్లిక అత్యన్నత స్థానంలో ఉండడం బార్ అసోషియేషన్‌కు ఎంతో గర్వించదగ విషయమని, జిల్లాకు మంచి పేరు తీసుకురావల్సిందిగా ఆమెకు సూచించారు. న్యాయమూర్తిగా ఎంపికై న మల్లికను న్యాయమూర్తులు రవికుమార్, లక్ష్మీ, ఎన్‌విహెచ్ పూజిత, ఉదయ్‌నాయక్, బార్ అసోషియేషన్ సభ్యులు, సిబ్బంది శాలువ, పూలమాలతో ఘనంగా సంత్కరించారు.