
హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం
గద్వాల: డైట్ చార్జీలు పెంచిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, లక్ష్మణ్‌కుమార్, సీఎస్ రామకృష్ణారావు నిర్వహించిన వీడియోకా న్ఫరెన్స్‌లో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ హాస్టళ్ల నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. హాస్టల్ ప్రాంగణాల్లో పచ్చదనం, పరిశుభ్రత వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నిబంధనల మేరకు అర్హులైన ప్రతిపేవాడికి ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేందుకు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. భూభారతిలో నమోదైన దరఖాస్తులను నిబంధనల మేరకు వెంటనే పరిష్కరించడం జరిగిందన్నారు. వనమహోత్సవం నిర్వహించి క్షేత్రస్థాయిలో విరివిరిగా మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, భూసేకరణ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.