
‘కాలగమనం’ పుస్తకావిష్కరణ
అచ్చంపేట: ప్రముఖ కవి ఎంఏ గఫార్ రచించిన కాలగమనం పుస్తకాన్ని ఆదివారం పట్టణంలోని గురుకుల పాఠశాలలో తెలంగాణ ప్రముఖ కవి, వక్త, సాహితీవేత్త నాగేశ్వరం శంకరం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంఏ గఫార్ మాతృభాష ఉర్దూ అయినప్పటికీ తెలుగులో కవిగా రాణించడం గొప్ప విషయమన్నారు. తెలుగు భాషపై ఉన్న మక్కువతో నల్లమల రత్నాలు, ప్రజాప్రస్థానం, మేలుకొలుపు తదితర రచనలు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. మకట శతకంలో వచన కవిత్వాన్ని రచించడం చాలా అరుదు అని.. అలాంటి వారిలో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఆయన ముందు వరుసలో ఉంటారన్నారు. ఇలాంటి కవులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న కవులను డాక్టర్ బాలనారాయణ శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో కవులు వల్లభాపురం జనార్దన్, కర్నాటి రఘురాములుగౌడ్, ముచ్చర్ల దినకర్, వనపట్ల సుబ్బయ్య, సాయిజ్యోతి, కాటమరాజు నరసింహులు, ఎదురవల్లి కాశన్న, ఖాజా మైనొద్దీన్, కందికొండ మోహన్ పాల్గొన్నారు
దరఖాస్తుల ఆహ్వానం
కందనూలు/మన్ననూర్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను అతిథి అధ్యాపక పోస్టుల భర్తీ నిమిత్తం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ మదన్మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు, ఇంగ్లిష్, కెమిస్ట్రీ, జు వాలజీ, డైరీ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్ సబ్జెక్టుల్లో బోధించేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 12గంటలలోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నెట్, సెట్, పీహెచ్‌డి అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
● అమ్రాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు–1, కామర్స్–2, ఇంగ్లిష్–1, హిస్టరీ–1, ఎకనామిక్స్–1, పొలిటికల్ సైన్స్–1, జువాలజీ–1, కంప్యూటర్ సైన్స్–1 ఖాళీల భర్తీకి అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గోపాల్ తెలిపారు. ఆయా సబ్జెక్టులకు సంబంధించి పీజీలో 55 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. సెట్, నెట్, స్లేట్, పీహెచ్‌డీ కలిగి ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా కళాశాలలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరింత సమాచారం కోసం 85228 73729, 83319 58940 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
లయన్స్ క్లబ్ సేవలు
అభినందనీయం
దామరగిద్ద: లయన్స్ క్లబ్ సేవలను మరింత విస్తృతం చేయాలని, సామాజిక సేవే పరమావధిగా ముందుకు సాగాలని రాష్ట్ర పోలీస్, హౌసింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని గడిమున్కన్‌పల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు భీమయ్యగౌడ్ అద్యక్షత ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తృతం చేయాలని సూచించారు. అనంతరం దామరగిద్ద మండల నూతన లయన్స్‌క్లబ్ అధ్యక్షుడిగా బసిరెడ్డి, కార్యదర్శి గా ఎం.అశోక్, ట్రెజరర్‌గా తిప్పణ్ణ లను ఎన్నుకున్నారు. సేవల్లో భాగంగా దామరగిద్ద జీపీఎస్, కాన్‌కుర్తి పాఠశాలకు వాటర్ ట్యాంకును, బాపన్‌పల్లి కి పలువురి పేదలకు దుప్పట్లు, గడిమున్కన్‌పల్లి గ్రామ విద్యార్థులకు బ్యాగ్‌లను పంపిణీ చేశారు.
స్వామినాథన్ కమిటీ
సిఫార్సులు అమలు చేయాలి
మద్దూరు: రైతులకు మద్దతు ధర తదితర ఆంశాలపై స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను వెంటనే కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.రాము డిమాండ్ చేశారు. ఆదివారం మద్దూరులో ఏఐయూకేఎస్ సంఘం డివిజన్ స్థాయి ప్రథమ మహాసభకు హాజరై ప్రసంగించారు. స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తామని 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇన్నేళ్లు గడుస్తున్నా వాటిని అమలు చేయకపోగా నల్లచట్టాలను అమలు చేస్తోందన్నారు. వీటిపై పోరాటానికి రైతులను సంఘటితం చేయాలని సూచించారు.

‘కాలగమనం’ పుస్తకావిష్కరణ