
సూచనలు, సలహాలు అందిస్తున్నారు
గర్భిణిగా ఉన్న నాకు అంగన్‌వాడీ టీచర్, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు క్రమం తప్పక నా ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచనలు, సలహాలను అందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో భోజనం, గుడ్లు, పాలు అందిస్తున్నారు. ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు ప్రతి నెలా వైద్య పరీక్షలు చేయించుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. గర్భిణిగా ఉన్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారం గురించి నిత్యం అవగాహన కల్పిస్తున్నారు.
– తిరుమలమ్మ, గర్భిణి, గట్టు
పోషణ లోపాలు
అధిగమించేందుకు..
తీవ్ర లోప పోషణ, అతి తీవ్ర లోప పోషణ, సాధారణ స్థితిలో గల పిల్లల విషయాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ, పోషణ లోపం నుంచి బయట పడేందుకు చిన్నారులకు బాలామృతం ప్లస్ అందిస్తున్నాం. తల్లిదండ్రులకు, గర్భిణులు, బాలింతలకు అవగాహన సమావేశాలను నిర్వహించి, తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నాం. క్షేత్ర స్థాయిలో ప్రతి అంగన్‌వాడీ టీచర్ గర్భిణులు, బాలింతలపై నిరంతరం పర్యవేక్షించేలా ఆదేశిస్తున్నాం.
– హేమలత, సీడీపీఓ, మల్దకల్ ప్రాజెక్టు
సేవలు వినియోగించుకోవాలి
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆట పాటలతో పాటుగా సిలబస్ ప్రకారం పూర్వప్రాథమిక విద్యను అందించి, పాఠశాల విద్యకు పిల్లలను సిద్ధం చేస్తాం. పిల్లల్లో పోషణ లోపాలను గుర్తించి, సాధారణ స్థితికి తీసుకు రావడం జరుగుతుంది. వ్యాధి నిరోధక టీకాలను అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని అన్నీ అంగన్‌వాడి కేంద్రాల్లో తక్కువ బరువు, పోషణ లోపం కలిగిన చిన్నారులను మెరుగు పరచేందుకు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాం. అంగన్‌వాడీ సేవలను వినియోగించుకోవాలి.
– సునంద, డీడబ్ల్యూఓ, గద్వాల
●