
తనిఖీలు నిర్వస్తాం
అయిజకు చెందిన గర్భిణి అంశంపై రెండు డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశాం. నిర్వాహకుల నివేదికలను త్రీ మెన్ కమిటీ విచారణ చేపడుతుంది. వారి నివేదికల ఆధారంగా తగు చర్యలు తీసుకుటాం. గర్భిణికి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 15వ తేదిన శస్త్ర చికిత్స ద్వారా ప్రసవం చేశాం. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. అనుమతి లేకుండా ఆస్పత్రులు, ల్యాబ్‌లు నిర్వహించినా.. వ్యాధి నిర్ధారణ పరీక్షల పేరుతో అధికంగా డబ్బు వసూలు చేసినా తనిఖీలు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– సిద్దప్ప, జిల్లా ఇన్‌చార్జ్ వైద్యాధికారి
●