రెఫర్‌ చేస్తే కమీషన్లు | - | Sakshi
Sakshi News home page

రెఫర్‌ చేస్తే కమీషన్లు

Jul 22 2025 7:55 AM | Updated on Jul 22 2025 8:17 AM

రెఫర్

రెఫర్‌ చేస్తే కమీషన్లు

జిల్లాలోని కొన్ని డయాగ్నోసి్‌ట్‌క్‌ ల్యాబ్‌ నిర్వాహకులు నిబంధనలు పాటించడంలేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఒక వ్యక్తి జబ్బు పడితే.. డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో రక్త పరీక్ష చేసి పాథాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ నిపుణులు వ్యాధి నిర్ధారణ చేస్తారు. కానీ అర్హతలేని వారు పరీక్షలు చేస్తూ తప్పుడు రిపోర్టులు ఇస్తుండడంతో ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా ఈ నెల 13వ తేదీన జిల్లాలోని అయిజకు చెందిన ఓ గర్భిణికి తప్పుడు రిపోర్టు ఇవ్వడం కలకలంగా మారింది. ప్రసవం కోసం ఓ గర్భిణిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఉమ్మనీరు ఎంత ఉందనే విషయం కోసం వైద్యులు స్కానింగ్‌ సీఫార్సు చేశారు. దగ్గరలోని డయాగ్నోస్టిక్‌ ల్యాబ్‌లో పరీక్షలు చేయగా ఉమ్మనీరు (ఏఎఫ్‌ఐ 3.4 సీ.ఎం) ఉన్నట్లు రిపోర్టు ఇచ్చారు. వైద్యులు గర్భిణికి సాధారణ కాన్పు సాధ్యం కాదని.. శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని గుర్తించి జిల్లా ప్రభుత్వాసుపత్రికి రెఫర్‌ చేశారు. ఆ రిపోర్టుపై అనుమానం కలగడంతో వైద్యులు గద్వాల జిల్లా కేంద్రంలోని మరో డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో పరీక్షలు చేయించగా.. ఉమ్మనీరు (ఏఎఫ్‌ఐ 11.12 సీ.ఎం) ఉన్నట్లు రిపోర్టు రావడంతో వైద్యులు శస్త్ర చికిత్సను ఉపసంహరించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. చివరికి ఈ నెల 15వ తేదీన ఆ గర్భిణికి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఉమ్మనీరు తక్కువగా ఉందని శస్త్ర చికిత్స ద్వారా ప్రసవం చేశారు. గద్వాల – అలంపూర్‌ సెగ్మెంట్‌లలో ప్రైవెటు వైద్యులు, డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు, ల్యాబ్‌ల నిర్వాహకులు, రోగుల నుంచి అందినంత దోచేస్తున్నారు. మరోవైపు వైరల్‌ జ్వరంతో ఆసుపత్రికి వెళ్లిన బాధితులకు మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

అవసరం లేకున్నా నిర్ధారణ పరీక్షలు

ప్రస్తుతం ప్రజలు వైరల్‌ జ్వరాల భారినపడుతుండగా..కొంతమంది వైద్యులు మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌ నిర్ధారణతో పాటు షుగర్‌, మూత్ర పరీక్షలు కూడా చేయించుకోవాలని సూచిస్తున్నారు. ల్యాబ్‌లలో రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు.

జిల్లాలోని గద్వాల – అలంపూర్‌ సెగ్మెంట్‌లో డయాగ్నోస్టిక్‌ సెంటర్లు 5, ప్రైవేటు ఆసుపత్రులు 45, క్లినిక్‌లు 19, డెంటల్‌ 18, రక్త పరీక్షలు (ల్యాబ్‌) 138, ఫిజియోథెరపీ సెంటర్‌లు 6, కంటి ఆస్పత్రులు 5 ఇలా మొత్తం 236 వైద్యశాఖ అనుమతితో ఉన్నాయి. మరోవైపు అనుమతి లేకుండా కొందరు వివిధ పేర్లతో ల్యాబ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వైద్యులు, ల్యాబ్‌ల నిర్వాహకులు కుమ్మకై ్క అవసరం లేని వైద్య పరీక్షలు చేయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాధితులు జబ్బుపడి ఆస్పత్రికి వెళ్లిన తరుణంలో ఫలానా ల్యాబ్‌కు వెళ్లాలని సిఫార్సు చేస్తున్నారు. ల్యాబ్‌ నిర్వాహకులు పరీక్షల రూపంలో వసూలు చేసే సోమ్ములో 20 నుంచి 40 శాతం వరకు సంబంధిత వైద్యులకు కమీషన్‌గా అందజేస్తున్న విషయం బహిరంగ రహస్యమే. జిల్లాలోని ప్రధాన ప్రభుత్వాసుపత్రుల ఎదురుగా కొందరు రక్త పరీక్షల సెంటర్‌లను ఏర్పాటు చేసుకున్నారు. వీరికి ఆయా ఆసుపత్రులలో పనిచేసే కొందరితో సంబంధాలు.. ప్రభుత్వాసుపత్రిలో చేయలేని పరీక్షలు బయటకు సిఫార్సు చేస్తున్నారు. ప్రతిఫలంగా ల్యాబ్‌ నిర్వాహకులు కొంత నజరానా అందజేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి వైద్య పరీక్షలకు అయ్యే ఖర్చులకు సంబంధించిన ధరల పట్టికను ఏర్పాటు చేయాలి. జిల్లాలో వైద్యులు, ఆర్‌ఎంపీలు, ల్యాబ్‌ నిర్వాహకులు, మె డికల్‌ దుకాణ యాజమానులు తదితర వ్యక్తులు అందరూ కలిసి దందా నిర్వహిస్తున్నారు.

జ్వరం వచ్చినా మలేరియా,

డెంగీ పరీక్షలు.. రోగి జేబుకి చిల్లు

అర్హత లేని వారు సైతం ల్యాబ్‌లు నిర్వహిస్తున్న వైనం

ఇటీవల ఓ గర్భిణికి తప్పుడు రిపోర్టుతో వెలుగులోకి..

రెఫర్‌ చేస్తే కమీషన్లు 1
1/2

రెఫర్‌ చేస్తే కమీషన్లు

రెఫర్‌ చేస్తే కమీషన్లు 2
2/2

రెఫర్‌ చేస్తే కమీషన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement