
నెత్తిన బోనం.. భక్తిభావంతో జనం
గద్వాలటౌన్: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా బోనాలు వేడుకలు నిర్వహించారు. డప్పు చప్పుళ్లు.. శివసత్తుల పూనకాలు.. పోతరాజుల విన్యాసాలతో సందడి నెలకొంది. ఆషాడమాసం చివరి సోమవారం సందర్భంగా జిల్లా కేంద్రంలోని వివిధ కాలనీలలో నిర్వహించిన బోనాల పండగను అత్యంత వైభవంగా నిర్వహించారు. మహిళలు, చిన్నారులు బోనాలు తలపై పెట్టుకుని ఊరేగింపుగా బయల్దేరారు. అనంతరం మహిళలు ఆలయాలకు చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఉదయం నుంచే గ్రామ దేవతల ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణ రహదారులు ఆధ్యాత్మిక సందడి నెలకొంది. వివిధ పార్టీల నాయకులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జిల్లా కేంద్రంలో వైభవంగా బోనాలు

నెత్తిన బోనం.. భక్తిభావంతో జనం

నెత్తిన బోనం.. భక్తిభావంతో జనం