
సాగునీరు అందించడమే లక్ష్యం
అలంపూర్: జోగుళాంబదేవి ఎత్తిపోతల పథకం ఆయకుట్టుదారులకు సక్రమంగా సాగు నీటిని అందించడమే లక్ష్యంగా వేలం పాట నిర్వహించడం జరుగుతుందని ఎత్తిపోతల పథకం కమిటీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం అలంపూర్‌లోని రైతు సంఘం భవనంలో జోగుళాంబదేవి ఎత్తిపోతల పథకం వేలం పాటను నిర్వహించారు. ఎత్తిపోతల పథకం నిర్వహణలో భాగంగా నిర్వహించే వేలం పాటలో 9 మంది పోటీ పడ్డారు. ఈమేరకు శ్రీనివాసులు అనే వ్యక్తి రూ.46.70 లక్షలకు పాడి వేలం దక్కించుకున్నట్లు తెలిపారు. గతేడాది రూ.21.20 లక్షలకు వేలం దక్కించుకోగా.. ఈ ఈ ఏడాది ఏకంగా రూ. 25.50 లక్షలు పెరిగినట్లు తెలిపారు. వేలం పాట ద్వార వచ్చిన ఆదాయాన్ని ఎత్తిపోతల పథకం మోటార్ల మరమ్మతు, పైప్‌లైన్ ఇతర నిర్వహణ వంటి పనులు చేపట్టడం జరుగుతుంది. సమావేశంలో ఎత్తిపోతల పథకం కమిటి సభ్యులు బ్రహ్మేశ్వర్ రెడ్డి, రజిని బాబు, పెద్దబాబు, విశ్వనాథం, చెంచయ్య, జయన్న, హరినాథ్ రెడ్డి, రమేష్, నాగరాజు యాదవ్, గ్రామ పెద్దలు ధర్మరాజు, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.