
ర్యాలంపాడులో కదలిక
సాగునీటి పారుదల శాఖ మంత్రి పర్యటనతో మరమ్మతు పనుల్లో చలనం
2022లో రిపోర్ట్ అందజేత
గద్వాల: రూ.వేల కోట్లు వెచ్చించి నిర్మించిన ర్యాలంపాడు సాగునీటి ప్రాజెక్టు కొందరు అవినీతి అధికారులు, కాంట్రాక్టర్ల వల్ల ప్రమాదంలో పడింది. అందుబాటులోకి వచ్చిన ఏడాది కాలంలోనే జలాశయం మొదలుకొని, కుడి, ఎడమ తూముల అడుగుభాగాల్లో ఏర్పడిన లీకేజీలతో రూ.కోట్ల ప్రజాధనం నీట కొట్టుకుపోతుంది. దీనిపై పలుమార్లు సర్వేలు, డీపీఆర్ నివేదికలు గత, ప్రస్తుత ప్రభుత్వాలకు సమర్పించినా చలనం లేకుండా పోయింది. ఎట్టకేలకు ఇటీవల సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి క్షేత్రస్థాయిలో జలాశయాన్ని సందర్శించడంతో పాటు అధికారులతో వివరాలు సేకరించారు. ఈనేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో మరమ్మతు కోసం సమగ్ర సర్వేకు అవసరమైన నిధుల మంజూరు అవుతున్నట్లు తెలిసింది.
ర్యాలంపాడు జలాశయం ఆనకట్ట
సదరు సంస్థ 2022 మార్చిలో సర్వే పనులు చేపట్టి లీకేజీల మరమ్మతుకు సుమారు రూ.137 కోట్లు వ్యయం అవుతుందని 2023 జనవరిలో ఇరిగేషన్ శాఖకు రిపోర్ట్ అందించారు. అంచనాలు రూపొందించిన అధికారులు తుది నివేదికను 2024 డిసెంబర్‌లో ప్రభుత్వానికి సమర్పించారు. అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌లో పుణెకు చెందిన సీడబ్ల్యూసీ సంస్థ ఇంజినీర్ల నిపుణుల బృందం ర్యాలంపాడును సందర్శించి లీకేజీలను పరిశీలించారు. మరోసారి సర్వే చేసేందుకు రూ.1.86 కోట్లు అవసరం అవుతుందని నిపుణుల బృందం ఇరిగేషన్‌శాఖ ఈఎన్‌సీకి వివరించారు. విషయాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వివరించడంతో రెండు, మూడు రోజుల్లో అందుకు కావాల్సిన నిధులు మంజూరు చేసేందుకు సముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఐదేళ్ల క్రితం జలాశయానికి గండి
2024 డిసెంబర్‌లో రూ.137 కోట్ల అంచనాతో నివేదిక
ఏప్రిల్‌లో పూణెకు చెందిన సీడబ్ల్యూసీ సంస్థ నిపుణుల బృందం సందర్శన