
‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావాలి
ఎర్రవల్లి: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఉగ్రమూకలపై భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు శుక్రవారం బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో ఈఓ రామన్‌గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారత సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా శత్రు దేశానికి మన దేశ త్రివిధ దళాల సైనికులు తగిన గుణపాఠం చెప్పాలని, అలాగే వారికి దైవిక బలంతోపాటు రక్షణ, ఆంజనేయస్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ అర్చకులు వేదమంత్రాల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మారుతిచారి, సందీప్‌చారి, సిబ్బంది పాల్గొన్నారు.