ఇదివరకు సదరం సర్టిఫికెట్లు ఉన్న దివ్యాంగులు రాష్ట్రంలో పెన్షన్, ఇతర ప్రయోజనాలను యధావిధిగా పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఏదైనా ప్రయోజనం పొందాలంటే యూడీఐడీ కార్డు తప్పనిసరి అన్నారు. 2025మార్చి 1వ తేదీ నుంచి కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు యూడీఐడీ పోర్టల్ www.swavalambancard.gov.in ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇకమీదట సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను పూర్తిగా నిలిపివేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా సదరం సర్టిఫికెట్లు రెన్యువల్ చేసుకునే సమయంలో ఖచ్చితంగా యూడీఐడీ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ఉన్న మీ–సేవా కేంద్రాల నిర్వాహకులు యూడీఐడీ దరఖాస్తుల నమోదుపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, డీడబ్ల్యువో సునంద, మెడికల్ కాలేజీ సూపరిండెంట్ ఇందిర, ఇంచార్జీ డీపీవో నాగేంద్రం, ఎంపీడీవోలు, ఎంపీవోలు, మీసేవా కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.