చారిత్రక కట్టడాలను పునరుద్ధరించాలి | - | Sakshi
Sakshi News home page

చారిత్రక కట్టడాలను పునరుద్ధరించాలి

Mar 5 2025 12:57 AM | Updated on Mar 5 2025 12:54 AM

గద్వాలటౌన్‌: సంస్థానాదీశుల కాలం నాటి కోట, లింగంబావిని పునరుద్ధరించి, సుందరీకరణ పనులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ సంతోష్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం అడిషనల్‌ కలెక్టర్‌ లక్ష్మీనారాయణతో కలిసి చారిత్రక నిర్మాణాలు, కట్టడాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చారిత్రక కట్టడాలను పునరుద్ధరించి, భవిష్యత్‌ తరాలకు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గద్వాల కోటను పర్యాటక ఆకర్షణగా అభివృద్ధి చేయడానికి అవసరమైన మరమ్మతులు, శుభ్రత, భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. కోట, లింగంబావిల పునరుద్ధరణ కోసం డీపీఆర్‌ తయారుచేయాలని ఆర్కిటెక్ట్‌ అధికారులను ఆదేశించారు. కట్టడాన్ని స్థిరంగా నిలిపేందుకు సరైన నిర్మాణ ప్రణాళికలు రూపొందించాలన్నారు. లింగంబావి పరిసర ప్రాంతాలు ఆకర్షణగా ఉండేందుకు ల్యాండ్‌స్కేపింగ్‌ పనులు చేపట్టాలన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ దశరథ్‌, అర్కిటెక్ట్‌ అధికారిణి శ్రీలేఖ పాల్గొన్నారు.

నీట్‌ పరీక్ష కేంద్రాల పరిశీలన

జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్‌– 2025 నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలో ఉన్న గద్వాల ఎస్‌ఆర్‌ విద్యానికేతన్‌ స్కూల్‌లలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను ఎస్పీ శ్రీనివాస్‌రావుతో కలిసి కలెక్టర్‌ సంతోష్‌ క్షేత్రస్థాయి పరిశీలించారు. ఆయా పరీక్ష కేంద్రాలలో ఉన్న వసతులు, ఏర్పాట్లను పరిశీలించారు. నీట్‌–2025 నిర్వహణకు సంబంధించి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. సీసీటీవీ పర్యవేక్షణ తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు క ల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ అబ్దుల్‌ఘనీ, కోఆర్డినేటర్‌ వెంకటేష్‌, ప్రిన్సిపాల్స్‌ రాముడు, నందిని తదితరులు పాల్గొన్నారు.

గద్వాల కోట, లింగంబావిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి

కలెక్టర్‌ బీఎం సంతోష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement