గద్వాల: ప్రధాన మంత్రి ఇంటర్న్ షిప్ పథకం రెండో దశ ప్రారంభమైనట్లు పథకానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారుడి వయసు 21–24మధ్య ఉండాలని, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం ఉండరాదని, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయి ఉండాలని తెలిపారు. అదేవిధంగా కుటుంబ సంవత్సర ఆదాయం రూ.8లక్షల లోపు ఉండాలని, ఎంపికై న విద్యార్థులకు నెలసరి జీతం రూ.5000లు ఇవ్వనున్నట్లు తెలిపారు. 12నెలల ఇంటర్న్‌షిప్ కాల వ్యవధిలో కనీసం 6 నెలల పాటు ఉద్యోగ శిక్షణ ఉంటుందని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు pmintership.mcf.gov.in పోర్టల్‌లో మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.