
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్ సరిత
గద్వాల అర్బన్: కుటుంబ పాలనతో గద్వాల నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని జెడ్పీ చైర్‌పర్సన్ సరిత అన్నారు. సోమవారం జమ్మిచేడు, వెంకటోముపల్లి, మల్ధకల్ మండలంలోని బిజ్వారం గ్రామం, ధరూర్ మండలంలోని గార్లపాడు గ్రామానికి చెందిన వారు పెద్దఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి జెడ్పీ చైర్‌పర్సన్ సరిత కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే ఆభివృద్ధి సాధ్యమని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. రాబోయే రోజుల్లో గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఽఽధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.