
పాట పాడుతున్న గాయని శ్రావణ భార్గవి
స్టేషన్ మహబూబ్‌నగర్: సినీ పాటలు...సాంస్కృతిక కార్యక్రమాలతో సోమవారం రాత్రి పాలమూరు మినీ ట్యాంక్‌బండ్ పరిసరాలు సందడిగా మారాయి. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలోని మినీట్యాంక్ బండ్ వద్ద మూడు రోజుల పాటు నిర్వహించనున్న సాంస్కృతిక కార్యక్రమాలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఎకై ్సజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, కలెక్టర్ జి.రవినాయక్, ఎస్పీ నరసింహ తదితరులు జ్యోతి ప్ర జ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాకేంద్రంలోని మినీ ట్యాంక్‌బండ్ పరిసరాలను అంతర్జాతీయస్థాయిలో పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఆహ్లాదం కోసం తమ కుటుంబసభ్యులతో కలిసి మినీ ట్యాంక్‌బండ్‌కు వచ్చి ఆనందంగా సేదతీరేలా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. త్వరలో ప్రతి ఆదివారం మినీ ట్యాంక్‌బండ్ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేసీఆర్ అర్బన్ పార్క్‌లో 18 కిలోమీటర్ల జంగిల్ సఫారీ ప్రారంభించనున్నట్లు తెలిపారు.
సినీపాటలతో శ్రావణ భార్గవి సందడి
ప్రముఖ సినీనేపథ్య గాయని శ్రావణ భార్గవి, కిరణ్ పాడిన పాటలు అలరించాయి. ముఖ్యంగా శ్రావణ భార్గవి పాటలకు ప్రేక్షకులు చప్పట్లు, అరుపులతో హోరెత్తించారు. చంమ్‌కిలే అంగిలేసి ఓ వదినే, బ్లాక్‌బస్టర్, సింహాం లాంటి చిన్నోడు, దిగుదిగు నాగ తదితర పాటలతో సందడి చేశారు. డిల్లు బ్రదర్స్ ఎయిర్ వాక్ ఆకట్టుకుంటుంది. రెండు వైపుల ఇనుపపైపులపై కాళ్లను కిందకు తగలకుండా చేసిన ఫిట్లు ప్రేక్షకులను మైమరిపించాయి.
● అలరించిన ప్రపంచపర్యాటక దినోత్సవ సంబరాలు