
ఎర్రవల్లిచౌరస్తా: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని శివాలయంలో భక్తులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రదాన అర్చకులు శివునికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో బీచుపల్లికి చేరుకొని భక్తిశ్రద్ధలతో శివుడిని దర్శించుకున్నారు. అనంతరం ధ్వజస్తంభం ఎదుట కొబ్బరికాయలు కొట్టి మొక్కులను తీర్చుకున్నారు.
విడతల వారీగా
సమస్యల పరిష్కారం
గద్వాల క్రైం: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు 5 ఫిర్యాదులు అందాయి. వివిధ మండలాలకు చెందిన వారు సమస్యలపై విన్నవించుకున్నారు. భూ వివాద, కుటుంబ, ఆస్తి తగాదాలపై ఎస్పీ సృజన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎస్పీ వారితో మాట్లాడుతూ.. విడతల వారీగా సమస్యలు పరిష్కారం చేస్తామని బాధితులకు వివరించారు. సివిల్ కేసులను కోర్టులో పరిష్కారం చేసుకోవాలని సూచించారు.
వట్టెం వెంకన్న
పవిత్రోత్సవాలు ప్రారంభం
బిజినేపల్లి: మండలంలోని వట్టెం వేంకటేశ్వరస్వామి దేవస్థాన పవిత్రోత్సవాలు సోమవారం సాయంత్రం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయ అర్చకులు బుధవారం సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసినట్లు ఆలయ కమిటీ తెలియజేశారు.
